బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చూసి 40 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ ఇచ్చిన బద్వేల్ ప్రజలు ఇప్పుడు జగనన్న పరిపాలన చూసి 90 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ ఇచ్చారని తెలిపారు. జగనన్న సుపరిపాలనకు ప్రజలంతా మద్దతు ప్రకటిస్తున్నట్లు బద్వేల్ తీర్పు స్పష్టం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గెలుపొందిన డాక్టర్ సుధాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏ సెంటర్‌లో అయినా, ఏ టైమ్‌కైనా, ఏ ఎలక్షన్ అయినా జగన్‌మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండ్‌తో అన్ని పార్టీలను ఓడిస్తారని రోజా తెలిపారు. అన్ని పార్టీలు కలిసి బద్వేల్‌లో తమను దొంగ దెబ్బతియాలని చూసినట్లు ఆమె ఆరోపించారు. బద్వేల్ ప్రజలను ప్రతిపక్షాలను ఎమ్మెల్యే సీటు కాదుగదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని బాలయ్య డైలగ్‌తో రోజా ఉప ఎన్నికలపై స్పందించారు.
ఎన్నిక ఏదైనా ప్రజలు ఎప్పుడూ జగనన్న వైపే అని మళ్ళీ నిరూపితమైంది. ఈ సందర్భంగా డా.సుధమ్మకు శుభాకాంక్షలు మరియు ఇంతటి ఘన విజయాన్ని అందించిన బద్వేల్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.#YSRCPWinsBadvel #CMYSJagan pic.twitter.com/twdasMkBzX
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 2, 2021