బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చూసి 40 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ ఇచ్చిన బద్వేల్ ప్రజలు ఇప్పుడు జగనన్న పరిపాలన చూసి 90 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ ఇచ్చారని తెలిపారు. జగనన్న సుపరిపాలనకు ప్రజలంతా మద్దతు ప్రకటిస్తున్నట్లు బద్వేల్ తీర్పు స్పష్టం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గెలుపొందిన డాక్టర్ సుధాకు శుభాకాంక్షలు తెలియజేశారు. […]
బద్వేల్ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,950 మోజార్టీతో గెలుపొందారు. ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి మెజార్టీని మించిపోవడంతో ఒక్కసారిగా ఈమె పేరు మారుమోగింది. ఈ ఉప ఎన్నికల్లో తెదేపా, జనసేన పోటి చేయలేదు. బద్వేల్ ఉపఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రేస్ పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈమె మెజార్టీపైనే చర్చలు జరుగుతున్నాయి. నెటిజన్లు అంతా అసలు […]
దేశంలో ఖాళీగాఉన్నన పార్లమెంట్, శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. హుజూరాబాద్, బద్వేల్ శాసనసభ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. […]