బద్వేల్ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,950 మోజార్టీతో గెలుపొందారు. ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి మెజార్టీని మించిపోవడంతో ఒక్కసారిగా ఈమె పేరు మారుమోగింది. ఈ ఉప ఎన్నికల్లో తెదేపా, జనసేన పోటి చేయలేదు. బద్వేల్ ఉపఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రేస్ పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈమె మెజార్టీపైనే చర్చలు జరుగుతున్నాయి. నెటిజన్లు అంతా అసలు దాసరి సుధ ఎవరు అని వెతుకులాట మొదలు పెట్టారు. డాక్టర్ దాసరి సుధ గురించి ఆసక్తికర అంశాలు మీకోసం.
అప్పటి వరకు ప్రజాసేవ అంటే తన వద్దకు వచ్చిన వారికి వైద్య చేయడమే అనుకునేది దాసరి సుధ. ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చడం మాత్రమే తెలిసిన ఆమె.. అనుకోని పరిణామలతో ప్రజల సాంఘీక జీవిత సమస్యలను పరిష్కరించేందుకు రావల్సి వచ్చింది. కర్నూలు వైద్యకళాశాలలో సుధ 1999లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దాసరి సుధ గారు గైనకాలజీ నిపుణురాలు. దాసరి వెంకట సుబ్బయ్య దంపతులు ఇద్దరు వైద్యులు కావడం విశేషం. వీరు కడపలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో సేవలు అందించారు.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి పోటి చేసిన వెంకట సుబ్బయ్య సమీప ప్రత్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ పై 44,734 మెజార్టీతో విజయం సాధించారు. అనారోగ్య సమస్యలతో గతేడాది వెంకట సుబ్బయ్య మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో దాసరి సుధ పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీకి వెళ్లనున్నారు. తన భర్త ఆకాల మరణంతో జరిగిన బద్వేల ఉప ఎన్నిక పోరులో డా. దాసరి సుధ 90,950 మోజార్టీతో ఘన విజయం సాధించారు. బద్వేల్ నియోజకవర్గ చరిత్రలోనే ఇదే భారీ విజయం. వైసీపీ భారీ విజయంపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.