రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. తనకు డబ్బులు ఆఫర్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాపాక.. దొంగ ఓట్ల వల్లే గెలిచానంటూ బాంబు పేల్చారు. ఇది వివాదాస్పదం కావడంతో.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు రాపాక. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పెంచాయి. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు తనకు కూడా డబ్బులు ఆఫర్ చేశారంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలురు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆ వివాదం సద్దుమణగముందే.. రాపాక మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దొంగ ఓట్ల వల్లే తాను గెలిచానంటూ రాపాక చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రాపాక దొంగ ఓట్లతో గెలిచాడా అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎన్నికల కమిషన్ రాపాక మీద వేటు వస్తుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలో దొంగ ఓట్ల కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు రాపాక. దీనిపై ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దాంతో రంగంలోకి దిగిన రాపాక డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. తన మాటలను వక్రీకరించారు అన్నాడు. తాను 32 ఏళ్ల క్రితం జరిగిన ఘటననే గుర్తు చేశానంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. తాను మాట్లాడింది ఎమ్మెల్యే ఎన్నికల గురించి కాదని.. 32 ఏళ్ల క్రితం సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన సంఘటనను తాను ఇప్పుడు గుర్తు చేసుకున్నాను అన్నారు. అంతేకాక 2019 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు తనకు పడలేదన్నారు.
అంతేకాక నిన్న తాను మాట్లాడినదానికి సంబంధించి.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకి సంబంధించిన ఫుల్ ఫుటేజీని స్వయంగా విడుదల చేశారు ఎమ్మెల్యే రాపాక. ఆ వీడియోలో గతంలో దొంగ ఓట్లు వేసే వాళ్లం అంటూ మాట్లాడారు. అయితే వీడియోలో 2019 ఎన్నికలు అని గానీ.. 32 ఏళ్ల క్రితం అని కూడా ఎక్కడా పలకలేదు. కానీ దొంగ ఓట్లు వేయించే వాళ్లం అంటూ రాపాక మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపించాయి. దొంగ ఓట్ల వల్ల స్పష్టమైన మెజారిటీ వచ్చేదని.. రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు మారతాయని.. ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలంటూ రాపాక ఆ సమావేశంలో మాట్లాడారు.
అంతేకాక గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గ వైసీపీ క్యాండేట్ ఓడిపోడానికి నాయకత్వ లోపమే కారణమన్నారు రాపాక. జగన్ వేవ్‌లోనూ రాజోలులో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం దారుణమని తెలిపారు. దొంగ ఓట్లతో కాదని.. తనకు సత్తా ఉంది కాబట్టే గెలిచానంటూ తనపై వస్తోన్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాపాక. అయితే ఆయన వీడియోలో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు అన్నారు అంటే.. ఆయన గత ఎన్నికల్లో దొంగ ఓట్లకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. మరి రాపాక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
దొంగ ఓట్ల కామెంట్స్‌పై రాజోలు ఎమ్మెల్యే రాపాక క్లారిటీ.. 32 ఏళ్ల క్రితం జరిగింది చెప్పాను! – రాపాక#RapakaVaraPrasadaRao #YSRCP #SumanTV pic.twitter.com/hHqKdXW99S
— SumanTV (@SumanTvOfficial) March 28, 2023