తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశసంలు కురిపించడంతో పాటు ఓ సాయం కూడా కోరాడు. అయితే మంగళవారం అనంతపురం జిల్లాలో పవన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మరణించిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే పవన్ పర్యటనపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పందించారు.
ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
కౌలు రైతులకు పవన్ ఆర్థిక సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పవన్ పర్యటన కారణంగానే ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాలోకి డబ్బులు వేసిందని స్పష్టం చేశారు. పవన్ వస్తే కానీ రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇవ్వారా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక ఇలాంటి సమస్యలు మా జిల్లాలో కూడా ఉన్నాయని వీలైతే పవన్ కళ్యాణ్ మా జిల్లాకు కూడా రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఇక జగన్ నా వెంట్రుక కూడా పీకలేరని సొంత ఎమ్మెల్యేలనే అన్నారంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.