ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా తనని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 2లోగా తన వివరణను పంపాలంటూ బీజేపీ హైకమాండ్ డెడ్‌లైన్ పెట్టింది.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్‌లో షో ఏర్పాటుని మొదటి నుంచి రాజాసింగ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులకు సైతం విజ్ఞప్తి చేశారు. అయినా సరే డీజీపీ అనుమతి ఇవ్వడంతో రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తిని క్షమించమంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజాసింగ్ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత రాజాసింగ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
ఆ వీడియో కాస్తా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియో యూట్యూబ్ నుంచి తొలగించారు. ఆ తర్వాత దానికి కంటిన్యూ వీడియో కూడా పోస్ట్ చేస్తానంటూ రాజాసింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజాసింగ్‌పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ధర్మం కోసం కావాలంటే పార్టీని సైతం ఎదిరిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ వివాదాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్‌ను సస్పెండ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.