'విరూపాక్ష' థియేటర్లలోకి వచ్చేసింది. ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. అదే టైంలో ఓటీటీ పార్ట్ నర్ కూడా ఎవరనేది తెలిసిపోయింది.
ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. ప్రేక్షకుల్ని వాటిని చూస్తూనే ఉంటారు. రీసెంట్ టైంలో దాదాపు కమర్షియల్, నేటివిటీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. హారర్, థ్రిల్లర్ టైప్ స్టోరీలు ఈ మధ్య కాలంలో ఏం రాలేదు. దీంతో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’పై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా బాగుండేసరికి సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. అదే టైంలో ఓటీటీ పార్ట్ నర్ గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
ఇక విషయానికొస్తే.. హారర్, థ్రిల్లర్ సినిమాలు సరిగా తీయాలే గానీ కన్ఫర్మ్ గా క్లిక్ అవుతాయి. అలానే సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన మూవీ ‘విరూపాక్ష’. ఇందులో సాయిధరమ్ తేజ్ తోపాటు స్టార్ హీరోయిన్ సంయుక్తా మేనన్ యాక్ట్ చేయడం, పెయిర్ కూడా భలే క్యూట్ గా ఉండటం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. సినిమాను కూడా చాలా రిచ్ గా అంటే ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా తీశారు. అదే టైంలో ఓటీటీ డీల్ కూడా రిలీజ్ కు ముందు బాగానే కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓటీటీ లవర్స్ ‘విరూపాక్ష’ ఓటీటీ గురించి మాట్లాడేసుకుంటున్నారు.
‘విరూపాక్ష’ టైటిల్ కార్డ్స్ కంటే ముందు నెట్ ఫ్లిక్స్.. ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు వేశారు. అయితే రిలీజైన అంతటా.. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. నెక్స్ట్ వారం కూడా ఇలా పాజిటివ్ టాక్ కంటిన్యూ అయితే కలెక్షన్స్ కూడా మొత్తం వచ్చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లోని కొత్త సినిమాల ఓటీటీ రిలీజ్ బట్టి చూస్తే.. 4-5 వారాల్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. లేదు మేం అప్పటివరకు ఉండలేము అనుకుంటే.. థియేటర్ కి వెళ్లి మూవీని చూడొచ్చు. మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది. మరి ‘విరూపాక్ష’ని మీలో ఎంతమంది చూశారు? కింద కామెంట్ చేయండి.