సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయ్. గ్లామర్, టాలెంట్ ఉన్నా హిట్ పడితే కానీ ఆఫర్స్ రావు. ఒకవేళ వస్తే మాత్రం ఒకేసారి వరదలా భారీ అవకాశాలొస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయ్. గ్లామర్, టాలెంట్ ఉన్నా హిట్ పడితే కానీ ఆఫర్స్ రావు. ఒకవేళ వస్తే మాత్రం ఒకేసారి వరదలా భారీ అవకాశాలొస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల. వరుసపెట్టి సినిమాలు కమిట్ అవుతోంది. అమ్మడి క్రేజ్ చూసి ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోయిన్లను కూడా పక్కన పెట్టేసి శ్రీలీలకు ఛాన్సులిస్తున్నారు మేకర్స్. అవసరమైతే ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా. అలాంటిది వరుసగా నాలుగు హిట్స్ కొట్టిన హీరోయిన్ కెరీర్ ఎలా ఉండాలి?. స్టార్ హీరోలతో సినిమాలు, హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇలా హంగామాగా ఉంటుంది. కానీ ఈ బ్యూటీ పరిస్థితి మాత్రం కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంది.
ఆ యంగ్ యాక్ట్రెస్ ఎవరో కాదు. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ ఫిలింతోనే ఆకట్టుకున్న సంయుక్త.. తర్వాత కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తో బ్లాక్ బస్టర్ అందుకుంది. తన క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా మంచి పేరొచ్చింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ పక్కన బైలింగ్వల్ మూవీ ‘సార్’ తో హ్యాట్రిక్ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది. సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ లో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. అయితే వరుసగా నాలుగు సాలిడ్ హిట్స్ కొట్టిన సంయుక్తకు ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు ఎందుకు? అంటూ ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తెలుగులో ఎంట్రీ ఇవ్వకుముందు ‘ఎరిడా’ అనే మలయాళం మూవీలో సీనియర్ యాక్టర్ నాజర్‌తో రొమాన్స్‌లో రెచ్చిపోయి రచ్చ చేసింది సంయుక్త. తన సీన్స్ వల్లే సినిమా జనాలకు రీచ్ అయింది. క్యారెక్టర్ని డిమాండ్ చేసింది కాబట్టి అలా కనిపించింది కానీ తెలుగులో దాదాపు పద్ధతైన పాత్రలే చేసింది. ఇక కళ్యాణ్ రామ్‌తో రెండోసారి నటిస్తున్న ‘డెవిల్’ కూడా ఇంతకుముందు సైన్ చేసిన సినిమానే. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్లో కాస్త బొద్దుగా కనిపించింది. అయితే అందం, అభినయం, సక్సెస్ ట్రాక్ ఉన్న సంయుక్త మీనన్‌కు అవకాశాలు ఎందుకు రావట్లేదు?. తనకు కథలు, క్యారెక్టర్స్ నచ్చట్లేదా?. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చెయ్యకుండా నటిగా తనకు ఛాలెంజ్ విసిరే క్యారెక్టర్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అంటూ కొన్ని కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి