మరో వీకెండ్ వచ్చేసింది. అందుకు తగ్గట్లే మూవీ లవర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి ఎలానూ ‘అవతార్ 2’ థియేటర్లలోకి వస్తుంది. పక్కా చూడాల్సిందే అని చాలామంది ఫిక్సయిపోయారు. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ సినిమా తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రం.. మీ కోసం రేపు ఏకంగా 23 సినిమాల/ వెబ్ సిరీసులు ఓటీటీలో విడుదల కానున్నాయి. వీటిలో తెలుగు సినిమాల దగ్గర నుంచి హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలానే ఈ శుక్రవారం కూడా ఓటీటీలో 20కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇందులో స్టార్స్ ఉన్న సినిమాలు అయితే పెద్దగా ఏం లేవు. ‘ఆహా’లో నేరుగా రిలీజ్ అవుతున్న ‘ఇంటింటా రామాయణం’, హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ‘గోవింద్ నామ్ తేరా’, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ‘అరియప్పు’, సోనీ లివ్ లో నేరుగా స్ట్రీమింగ్ కానున్న ‘డోంట్ బ్రీత్’.. ఆడియెన్స్ కి కాస్త ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇవే కాకుండా పలు ఇంగ్లీష్ వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఈ వీకెండ్ లో సమ్ థింగ్ డిఫరెంట్ గా ప్రయత్నిద్దాం అనుకుంటే మాత్రం ఇవి ట్రై చేసి చూడొచ్చు. మరి ఈ వారం రిలీజ్ కాబోతున్న ఓటీటీ సినిమాల పూర్తి లిస్ట్ ఓసారి చూద్దాం.
డోంట్ బ్రీత్ – తెలుగు మూవీ
Here is a list of tomorrow’s OTT movie releases.! pic.twitter.com/2BeJ2i353W
— SumanTV (@SumanTvOfficial) December 15, 2022