ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. రిలీజ్ కాగానే అందరూ ఈ చిత్రం చూసేయాలనుకుంటారు. కానీ టికెట్స్ దొరక్కనో, తర్వాత చూద్దాంలే అనే ధీమాతో వాయిదా వేస్తారు. ఇక థియేటర్ కు వెళ్లలేకపోయామే అని బాధపడొద్దు. ఎందుకంటే మీ కోసం ఓటీటీలో ఏకంగా ఈ వారం 21 సినిమాలు- వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది. దీంతో ఎప్పుడు ఏవి చూడాలనేది ఇప్పటికే ప్లాన్ చేసి పెట్టేసుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వీకెండ్ అయిపోగానే సోమవారం చాలా కష్టంతో ఆఫీసులకు వెళ్తారు. అదే టైంలో ఈ వీకెండ్ లో ఏం ప్లాన్ చేయాలా అని ఇప్పటినుంచే ప్లాన్స్ వేసుకుంటారు. ఇక ఓటీటీలోనూ ఏయే మూవీస్ వస్తున్నాయా అని చూస్తారు. అలాంటి వారి కోసమే.. ఓటీటీలో రిలీజయ్యే సినిమాల జాబితాతో వచ్చేశాం. ఇందులో కొన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, మరికొన్ని థియేటర్లలోకి వచ్చి, ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఇక ఈ లిస్టులో ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ దగ్గర నుంచి, హారర్, థ్రిల్ జానర్స్ వరకు అన్ని ఉండటం విశేషం. మరి ఇందులో మీరు ఏ మూవీ ఫస్ట్ చూడాలనుకుంటున్నారు.
The weekend’s OTT movie releases are listed below! pic.twitter.com/iR78ZdeY2T
— SumanTV (@SumanTvOfficial) December 12, 2022