ఆహా.. తెలుగులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఇప్పటికే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పుడు ఆహాలో ‘ఇంటింటి రామాయణం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఈ సినిమాలో నరేశ్, రాహుల్ రామకృష్ణ, సీరియల్ ఆర్టిస్ట్ నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. భీమ్లానాయక్, డీజే టిల్లు వంటి సినిమాలను నిర్మించిన ‘సితారా ఎంటర్‌టైన్మెంట్స్’ ఇంటింటి రామాయణం సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ వైరల్ గా మారింది.
సినిమా టీజర్ ను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఆహాలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ మూవీ గురించి సితారా ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఎంతో గొప్ప టీమ్ తో ఈ సినిమాకి పనిచేశాం. ఈ మూవీలో ఎంతోమంది మంచి నటులు ఉన్నారు. మానవ బంధాలు, జీవిత గుణపాఠాలు వంటి వాటిని ఈ సినిమాలో చూపించాం. ఇంటింటి రామాయణం అందరికీ గుర్తిండిపోయే చిత్రం అవుతుందని భావిస్తున్నాం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే ఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది. రాములు(నరేశ్) కరీంనగర్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. అతని కుటుంబం ఓ సమస్యలో చిక్కుకుంటుంది. దానివల్ల ఇంట్లోని వాళ్లే ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలోనే ఎవరు ఏంటి? వారి అసలు రూపాలు ఏంటి అనే విషయాలు బయటకు వస్తాయి.
Iga mucchata shuru!😉
Ee gammatthu katha chudaniki ready kaandi thondarlo…Teaser out on November 25th.
An @ahavideoIN Original.#IntintiRamayanamOnAHA @DirectorMaruthi @vamsi84 @eyrahul #NavyaSwamy @SitharaEnts @Sureshflms @Venkatupputuri @innamuri8888 @GangavvaMilkuri pic.twitter.com/9zoRyStvwZ— Sithara Entertainments (@SitharaEnts) November 21, 2022
Iga mucchata shuru!😉
Ee gammatthu katha chudaniki ready kaandi thondarlo…Teaser out on November 25th.
An @ahavideoIN Original.#IntintiRamayanamOnAHA @DirectorMaruthi @vamsi84 @eyrahul #NavyaSwamy @SitharaEnts @Sureshflms @Venkatupputuri @innamuri8888 @GangavvaMilkuri pic.twitter.com/ueulp9sjZf— Rahul Ramakrishna (@eyrahul) November 21, 2022