పీరియాడికల్ స్టోరీతో తీసిన 'పొన్నియిన్ సెల్వన్ 2' కూడా ఓటీటీలోకి వచ్చేసింది. కానీ వాళ్లకే మాత్రమే స్ట్రీమింగ్ అవకాశం కల్పించారు. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమ్ అవుతోంది?
‘బాహుబలి’ తర్వాత ఆ తరహా తీసిన మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. ఫస్ట్ పార్ట్ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. రెండో భాగం ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. తొలి భాగంగా చాలావరకు తమిళులకు మాత్రమే నచ్చింది. సీక్వెల్ ని చూసిన చాలామంది మాత్రం బాగుందని అన్నారు. దీంతో కుదిరిన వాళ్లు థియేటర్లకు వెళ్లారు. కుదరని వాళ్లు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోరిక తీరింది. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. డైరెక్టర్ మణిరత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సఖి’, ‘బొంబాయి’ లాంటి చిత్రాలతో అప్పుడెప్పటి నుంచి ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’ని రెండు పార్టులుగా తీశారు. అయితే ఇది చోళులు, పాండ్యుల కథ కావడంతో తమిళులకు తప్ప మిగతా ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. అయితేనేం కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగాన్ని అమెజాన్ ప్రైమ్ లోకి తీసుకొచ్చేశారు.
ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు గానీ కేవలం రెంట్ విధానంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ప్రైమ్ మెంబర్ షిప్ తో సంబంధం లేకుండా రూ.399 చెల్లించి ఎవరైనా సరే సినిమా చూడొచ్చు. డబ్బులు పే చేసిన దగ్గర నుంచి 48 గంటల్లో మూవీ చూడాల్సి ఉంటుంది. మిగిలిన కండీషన్స్ కూడా వర్తిస్తాయి. ఇదిలా ఉండగా ఈ మూవీలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి లాంటి స్టార్స్ చాలామంది యాక్ట్ చేశారు. సో అదనమాట విషయం. మరి మీలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఎవరైనా చూస్తే.. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.