హాస్యబ్రహ్మ బ్రహ్మానందం చాలాఏళ్ల తర్వాత నటించిన 'పంచతంత్రం' సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఎవరూ కనీసం ఊహించని ఓటీటీలో విడుదల కానుంది. డేట్ కూడా ఫిక్స్ చేశారు.
ఏదైనా తెలుగు సినిమా రిలీజ్ కావడం లేటు. థియేటర్ కు వెళ్లి చూసేవాళ్లు కొందరైతే.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు మరికొందరు. పెద్ద సినిమాల విషయంలో స్టార్స్ ఉంటారు కాబట్టి చాలావరకు థియేటర్లలో కోట్లకు కోట్లు కలెక్షన్స్ సాధిస్తూ అదరగొడతాయి. పలు చిన్న సినిమాలు మాత్రం మంచి టాక్ తెచ్చుకున్నా సరే ఎందుకో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోతాయి. ఈ క్రమంలోనే ఓటీటీలోకి వస్తుందని తెలియగానే ఓ బజ్ క్రియేట్ అవుతుంది. అలా హాస్యనటుడు బ్రహ్మానందం చాలారోజుల తర్వాత నటించిన ఓ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది.
ఇక విషయానికొస్తే.. బ్రహ్మానందం పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకుల పెదాలపై ఆటోమేటిక్ గా చిరునవ్వు వచ్చేస్తుంది. అలాంటి ఆయన వయోభారం వల్లనో, ఛాన్సులు రాకపోవడం వల్లో తెలియదు గానీ కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యనే మళ్లీ ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తున్నారు. అలా రీఎంట్రీ ఇచ్చిన మూవీ ‘పంచతంత్రం’. గతేడాది డిసెంబరు 9న విడుదలైన ఈ చిత్రాన్ని.. మన బాడీలోని పంచేంద్రియాలు జ్ఞాపకాలతో అనుసంధానిస్తూ జీవితాన్ని చూడాలనే పాయింట్ తో తీశారు.
స్టోరీ బాగుంది, యాక్టర్స్ కూడా బాగానే చేశారనే టాక్ తెచ్చుకున్న ‘పంచతంత్రం’ సినిమా.. మార్చి 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ ఓటీటీలో చాలారోజుల నుంచి ఉన్నప్పటికీ కొత్త సినిమాలని ఏం కొనలేదు. ఇప్పుడు ‘పంచతంత్రం’ ఓటీటీ రైట్స్ కొని వార్తల్లో నిలిచింది. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చేవారంలో ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పించేలా కనిపిస్తోంది. మరి బ్రహ్మానందం నటించిన ‘పంచతంత్రం’ని ఓటీటీలో చూసేందుకు మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. దిగువన కామెంట్ చేయండి.