లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం పెద్దబ్బాయి రాజా గౌతమ్ కన్నెగంటి ‘పల్లకిలో పెళ్లి కూతురు’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. గౌతమ్ బిజినెస్, ఇన్‌కమ్ గురించి తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే మాటను తు.చ.తప్పకుండా పాటిస్తుంటారు సినీ సెలబ్రిటీలు. ఫామ్‌లో ఉండగానే వచ్చిన ఆఫర్లని క్యాష్ చేసుకుంటూ స్థలాలు, పొలాలు, ఇళ్లు కొనడం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఇండస్ట్రీలో దాదాపు చాలామందికి సినిమానే కాకుండా వేరే ఆదాయ మార్గాలున్నాయి. నటీనటులు, దర్శక నిర్మాతలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్ వంటి పలువురు టాలీవుడ్ స్టార్స్ మల్టీప్లెక్స్, రెస్టారెంట్, సెలూన్, నిర్మాణ సంస్థలు, స్టూడియోలు వంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి, యాక్టర్లగానే కాకుండా సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్స్‌గానూ రాణిస్తున్నారు. సీనియర్ నటుడు మురళీమోహన్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఎదిగారు. ‘జబర్దస్త్’ తో గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ కూడా ఇటీవల నెల్లూరు చేపల పులుసు బిజినెస్ స్టార్ట్ చేసి బాగానే సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ‘హాస్యబ్రహ్మ’ బ్రహ్మానందం కుమారుడు, యాక్టర్ రాజా గౌతమ్ సంపాదన గురించిన వార్తలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ‘అతడి నెల సంపాదనతో ఓ భారీ బడ్జెట్ సినిమా తియ్యొచ్చు తెలుసా!’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి రాజా గౌతమ్ కన్నెగంటి ‘పల్లకిలో పెళ్లి కూతురు’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. రెండో అబ్బాయి సిద్దార్థ్ బీటెక్ కంప్లీట్ చేసి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవలే తన నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రాజా గౌతమ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘బసంతి’, ‘మను’ లాంటి కొన్ని సినిమాలు చేశాడు కానీ తగినంత గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. త్వరలో తను యాక్ట్ చేసిన ‘బ్రేక్ అవుట్’ అనే సినిమా రిలీజ్ కానుంది. వాస్తవానికి గౌతమ్ సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. తండ్రి కోరిక మేరకే నటుడిగా పరిచయమయ్యాడట. కాగా ముందు నుండీ తనకు బిజినెస్ ఫీల్డ్ అంటేనే ఇష్టం అంట. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన గౌతమ్ సంపాదన కూడా భారీగానే ఉంటుందట. ఇంతకీ తను చేసే వ్యాపారాలేంటి? నెలకి ఎంత సంపాదిస్తాడు అనే వివరాలు ఇలా ఉన్నాయి.
గౌతమ్‌కు హైదరాబాద్‌లో కమర్షియల్ కాంప్లెక్స్‌లున్నాయట. వాటితో పాటు ఓ ఎమ్ఎన్‌సీ కంపెనీలో పెట్టుబడులు కూడా పెట్టారట. అలాగే బెంగుళూరులో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయట. వీటన్నిటి ద్వారా నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? అక్షరాలా రూ. 30 కోట్లు!. ఈ ఫిగర్ జస్ట్ అందాజ్ మాత్రమే అంటున్నారు. అంత ఆదాయం వస్తుంటే ఇక సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా టైంపాస్ కోసం ఓ సినిమా చేస్తుంటాడన్న మాట. ఇక గౌతమ్ బిజినెస్, ఇన్‌కమ్ గురించి తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు. ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘అత్తారింటికి దారేది’ మూవీలో ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’ అనే డైలాగ్ టైపులో ‘నీ నెల సంపాదనతో భారీ బడ్జెట్ సినిమా తియ్యొచ్చు బ్రో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీమ్స్ రాయుళ్ల క్రియేటివిటీకి పదును పెట్టేలా ఉంది.