తెలుగులో కొందరు హీరోలు చేసే సినిమాలు చాలా స్పెషల్! ఎందుకంటే హిట్ కోసమో కలెక్షన్స్ కోసమో కాకుండా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి మూవీస్ చేస్తారు. అలానే హిట్ కొట్టి, కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా సాధిస్తారు. ఇలాంటి వారిలో అల్లరి నరేష్ కూడా ఒకడు. కామెడీ హీరోగా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. గత కొన్నాళ్లుగా పెద్దగా సినిమాలు ఏం చేయట్లేదు. చాలా గ్యాప్ తర్వాత చేసిన ‘నాంది’ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. అదిచ్చిన ఊపుతోనే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ చేశాడు. నవంబరు 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మన ఎన్నికల వ్యవస్థ గురించి వివరించే చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో అల్లరి నరేశ్, శ్రీనివాస్ అనే స్కూల్ టీచర్ క్యారెక్టర్ చేశాడు. ఇక ఎన్నికల విధుల్లో భాగంగా మారేడుమిల్లి అనే మారుమూల గిరిజిన గ్రామానికి వెళ్తాడు. అయితే ఆ ప్రాంత వాసులు.. ఓట్లు వేయడానికి నిరాకరిస్తారు. ఇక శ్రీనివాస్ చేసిన ఓ సాయం వల్ల ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం రచ్చ రచ్చగా మారుతాయి. ఈ క్రమంలో చివరకు ఏం జరిగింది? మారేడుమిల్లి ప్రజానీకం చేసిన పోరాటం ఫలితాన్ని ఇచ్చిందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా పూర్తిగా చూడాల్సిందే. ఇకపోతే ఇది రెగ్యులర్ గా సాగే ఎంటర్ టైన్ మెంట్ మూవీ కాదు. ఓ సీరియస్ వేలో సాగి సోషల్ థ్రిల్లర్ డ్రామా.
ఇందులో హీరో అల్లరి నరేష్ తోపాటు హీరోయిన్ గా చేసిన ఆనంది, ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్ తదితరులు సినిమాలో నటించారు. అయితే విభిన్న ప్రయత్నం కావడం, ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోవడం వల్లనో ఏమో కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అందుకే థియేటర్లలోకి వచ్చిన నెలలలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ సినిమాను జనవరిలో ఓటీటీ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మరీ ఆలస్యమవుతుందని భావించి త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదైతేనేం.. ఈ వీకెండ్ కి ఏదైనా కొత్త సినిమా చూడాలనుకుంటే మాత్రం.. దీన్ని మీ లిస్టులో చేర్చుకోండి. మరి అల్లరి నరేష్ సినిమాల్లో మీకు బాగా నచ్చింది ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
The world of Maredumilli from the lens of a school teacher who set out to change the course of political action. #ItluMaredumilliPrajaneekamOnZee5 from December 23#itlumaredumilliprajaneekam @allarinaresh @anandhiactress @vennelakishore @ZeeStudios_ @HasyaMovies @dir_armohan pic.twitter.com/v27oJW6mKZ
— ZEE5 Telugu (@ZEE5Telugu) December 19, 2022