అమరావతి- ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు డబ్బులు అందించేందుకు జగన్ సర్కార్ రేడీ అయ్యింది. దీంతో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రయోజనం కలుగనుంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద ఒక్కో మహిళ బ్యాంక్ అకౌంట్లలోకి 18,750 రూపాయలు జమ కానున్నాయి. ఈ రోజు మంగళవారం ఈ డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి రానున్నాయి. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేలా లాంఛనంగా కంప్టూటర్ బటన్ నొక్కనున్నారు. కరోనా కష్ట కాలంలో మహిళలకు ఈ స్కీమ్ ద్వార జగన్ ప్రభుత్వం పెద్ద ఉరటనిస్తోందని చెప్పవచ్చు.
ఇప్పటికే ఈ స్కీమ్ లో చేరిన వారు కాకుండా కొత్తగా వైఎస్ఆర్ చేయూత స్కీమ్‌లో చేరాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్‌ను సిద్దంగా ఉంచుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయ్యయో లేదో చెక్ చేక్ చేసుకోవాలి. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనుంది. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా ప్రతి సంవత్సరం 18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు 19 వేల కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
ఇందులో భాగంగా వరుసగా రెండో ఏడాది 23 లక్షల 14 వేల 342 మంది మహిళలకు 4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని మంగళవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తద్వారా మొదటి, రెండో విడతలో కలిపి 8,943 కోట్ల మొత్తం అక్క చెల్లెమ్మలకు అందజేసినట్లు అవుతుంది. మే 13న రైతు భరోసా డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అటు పీఎం కిసాన్ స్కీమ్ మోదీ ప్రభుత్వం కూడా 2 వేల రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. దీంతో కరోనా కష్టాల్లో రైతులకు సైతం ఉరట లభించింది.