హైదరాబాద్ క్రైం- ఈ మధ్య హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అందుకు అనుగునంగా ప్రస్తుతం కొత్త ట్రెండ్ మొదలైంది. వేరే అంశాల నుంచి తప్పించుకునేందుకో, లేక ఇతరులపై పగ తీర్చుకునేందుకో తప్పుడు కేసులు పెడుతున్నారు. మొన్నామధ్య అల్వాల్ లో ఉరికెనే ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారని యువతి పిర్యాదు చేయడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా చివరికి అలాంటిది ఏమీ జరగలేదని పోలీసులు తేల్చడంతో, కావాలనే అలా చెప్పానని ఒప్పుకుంది యువతి.
ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ లో మళ్లీ అలాంటి ఘటనే జరిగింది. సంతోష్ నగర్ లో ఆటో ఎక్కిగా, తనను కిడ్నాప్ చేసి, పహాడీ షరీఫ్ తీసుకెళ్లి ముగ్గురు ఆటోడ్రైవర్లు అత్యాటారం చేశారని ఓ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేశారు. కానీ చివరికి అలాంటిది ఏమీ జరగలేదని, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఆ యువతి అబద్దం చెప్పిందని పోలీసులు తేల్చేశారు.
పాతబస్తీ చంద్రయాన్ గుట్ట లో తనపై ముగ్గురు వ్యక్తులు ఆటో లో కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ యువతి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతోష్ నగర్ లో ఆటోలో ఎక్కితే ముగ్గురు వ్యక్తులు పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకు వచ్చి గ్యాంగ్ రేప్ చేశారని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిన్న రాత్రి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. వెంటనే జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు.
దీనిపై హుటాహుటిన మూడు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. యువతి ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం సంఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. యువతి నిన్న ఆటో లో వెళ్ళినప్పటి నుండి మినట్ టు మినట్ సీసీ ఫుటేజ్ పరిశీలించారు. పైగా సీన్ ఆఫ్ ఆఫెన్స్ పొంతన లేకపోవడంతో పోలీసులకు ముందు ఏమీ అర్ధం కాలేదు. కిడ్నాప్ చేసిన సమయం, సీసీ ఫుటేజ్ టైం, యువతి చెప్పిన వివరాలకు ఎక్కడ పొంతన కుదరలేదు.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు భరోసా కేంద్రంలో యువతిని పదే పదే ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టింది. తన భాయి ఫ్రెండ్ కు మరో పెళ్లి నిశ్చయం కావడంతో అతడిని కేసులో ఇరికించేందుకు ఈ అత్యాచారం డ్రామా ఆదినట్లు పోలీసులు అసలు విషయం చెప్పింది. ఇంకేముంది ఇప్పుడు సదరు యువతిపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.