పెళ్లి నూరేళ్ళ పంట. జీవితానికి పరిపూర్ణత ఇచ్చే ఓ పండగ. కానీ.., పెళ్లే జీవితం కాదు. ఈ సృష్టిలో మనిషి ప్రాణం కన్నా విలువైంది ఏది లేదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేక ఓ లేడీ ఎస్సై బలవంతంగా తనువు చాలించింది. మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఈమె వయసు 35 సంవత్సరాలు. అందమైన రూపం. కావాల్సినంత సంపాదన. సంఘంలో గౌరవం. ఇలా అన్నీ ఉన్నా.., కవితా సోలంకికీ ఇంకా పెళ్లి కాలేదు.
జీవితంలో తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు పెళ్లి చేసుకోకూడదని ఆమె నిర్ణయించుకుంది. ఇలా తెలియకుండానే ఆమెకి 30 ఏళ్ళు వచ్చాయి. ఉద్యోగం హడావుడిలో పడి మరో కొన్నేళ్లు గడచిపోయాయి. ఇలా తిరిగి చూసుకునే సరికి కవితా సోలంకికీ 35 ఏళ్ళు వచ్చేశాయి. కావాల్సినంత సంపాదన ఉన్నా, అందంగా ఉన్నా, ఆమెని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకి రాలేదు. కారణం వయసు అయిపోయిదని! కవితా సోలంకి కూడా పెళ్లి విషయాన్ని ముందుగా లైట్ తీసుకుంది. కానీ.., చుట్టూ ఉన్న జనాలు ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వలేదు.
పెళ్లి ఎప్పుడు? ఇంకా ఎందుకు చేసుకోలేదు? అంటూ ప్రశ్నలతో ఆమెని వేధించడం మొదలు పెట్టారు. దీంతో.., ఆవేదనకి గురైన కవితా సోలంకి తన అధికార నివాసంలో విషం తాగేసింది. అనంతరం ఆ విషయాన్ని స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె వచ్చి.., సోలంకిని హాస్పిటల్ కి తరలించింది. కానీ.., అప్పటికే ఆలస్యం జరగడంతో ఘోరం జరిగిపోయింది. మృతురాలి అధికార నివాసంలో సూసైడ్ నోట్ లభించింది. “పెళ్లి ఎప్పుడు? అంటూ అడిగే జనాలకు సమాధానం చెప్పీ చెప్పీ అలసిపోయానని లేఖలో సోలంకి ఆవేదన వ్యక్తం చేసింది.
చూశారు కదా? ఇది ఎవరి తప్పు? ఈ మరణానికి కారణం ఎవరు? కచ్చితంగా ఈ శాడిస్ట్ సమాజం కాదా? ఒకడికి జాబ్ లేదని తెలిసి కూడా ఏమి చేస్తున్నావు అని అడుగుతాము! ఒకడికి పెళ్లి కావడం లేటవుతుందని తెలిసి కూడా పెళ్లి ఎప్పుడు అని అడుగుతాము! పేదరికంలో ఉన్నోడిని పట్టుకుని ఏమైనా సంపాదించావా అని వెటకారపు నవ్వు వదులుతాము! పిల్లలు పుట్టక నరకం అనుభవించే మహిళ దగ్గరకెళ్ళి ఏమైనా శుభవార్త అని కావాలనే ప్రశ్నిస్తాము! ఇదంతా మన సమాజంలో ఎన్నాళ్లగానో పేరుకొనిపోయిన శాడిజం. ఇప్పుడు కవితా సోలంకి మరణానికి కూడా మనుషుల్లోని ఈ శాడిజమే కారణం అయ్యింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.