హైదరాబాద్- ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ జెండా రెపరెపలాడింది. మనకు స్వాతంత్ర్యం తెచ్చిన త్యాగధనులను గుర్తు చేసుకంటూ, అంతా జెండా వందనం చేశాం. ఐతే జాతీయ జెండా విషయంలో మెగా హీరో రాంచరణ్ పొరపాటు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సాధారనంగా సెలబ్రిటీలు ఏంచేసినా అది వెంటనే వైరల్ అయిపోతుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఎక్కడ ఎంజరిగినా అందరికి చేరిపోతోంది. తాజాగా రామ్ చరణ్ విషయంలో అదే జరుగింది. జాతీయ పతాకాన్ని అవమానపరిచాడంటూ రామ్ చరణ్‌పై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రామ్ చరణ్ హ్యాపీ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ, ఆ మొబైల్స్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హ్యాపీ మొబైల్స్ సంస్థ దిన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఈ యాడ్స్ లో రామ్ చరణ్ జాతీయ జెండా పట్టుకొని సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఐతే ఆ జాతీయ జెండాలో అశోక చక్రం లేకపోవడం వివాదమవుతోంది. జాతీయ జెండా విషయంలో ఆ మాత్రం చూసుకోకుండా ఎలా యాడ్ లో నటించాలని రామ్ చరణ్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.
2002 జాతీయ జెండా చట్టం ప్రకారం ఇలా అశోక చక్రం లేకుండా జెండా ప్రదర్శించడం అనేది నేరమని గుర్తు చేస్తున్నారు. ఇంకేముంది రామ్ చరణ్ అంశం కాస్త చర్యనీయీంశమవుతోంది. యధావిదిగానే కొంత మంది మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ అభిమానులు ఆయనను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అది సంస్థ తప్పని, రామ్ చరణ్ కు ఏం సంబందం అని అంటున్నారు.
Today Eenadu Print paper Happi 🔥#RamCharan #RC15#SeethaRAMaRajuCHARAN#ManOfMassesRamCharan pic.twitter.com/bVvFMD90y3
— S 🔥 (@always2_suhel) August 9, 2021