సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. ప్రాంక్ వీడియో కాస్త పెను వివాదానికి దారి తీసింది. ఈ ప్రాంక్ వీడియో మీద టీవీ చానెల్‌లో డిబెట్ నిర్వహించారు. ఈ క్రమంలో హీరో విశ్వక్ సేన్, దేవి నాగవల్లి మధ్య వివాదం చోటు చేసుకుంది. డిబేట్ జరుగుతుండగా.. యాంకర్, విశ్వక్ సేన్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో దేవి నాగవల్లి.. విశ్వక్‌ని గెట ఔట్ అనడం.. దాంతో ఆగ్రహించిన విశ్వక్.. F పద వాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై నెటిజనులు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Devi Nagavalli: విశ్వక్‌సేన్‌కి మద్దతు.. యాంకర్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
మెజారిటీ నెటిజనులు.. విశ్వక్‌కు మద్దతు తెలుపుతున్నారు. దేవి నాగవల్లి ముందుగా అతడిని వ్యక్తిగతంగా విమర్శించింది కనుక.. విశ్వక్ ఇంతలా రియాక్ట్ అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక దేవి నాగవల్లి గతంలో కూడా ఇలానే ప్రవర్తించిందని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఆర్జీవీతో ఇంటర్వ్యూ సందర్భంగా కూడా దేవి ఇలానే ప్రవర్తించింది. వర్మకు కూడా వివాదాస్పద ప్రశ్నలు సంధించి ట్రోలింగ్‌కు గురయ్యింది. అలానే డీజే టిల్లు సినిమా ప్రమోషన్ సందర్భంగా కూడా హీరో సిద్ధు జొన్నలగడ్డని ఇలానే వివాదాస్పద ప్రశ్నలు అడిగి విమర్శలపాలయ్యింది. సిద్ధుని ఉద్దేశించి.. మీరు ఉమనైజరా అని ప్రశ్నించింది. అందుకు సిద్ధు చాలా డీసెంట్‌గా సమాధానం ఇచ్చినప్పటికి.. నెటిజనులు మాత్రం దేవిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.
ఇది కూడా చదవండి: Danam Nagender: దేవి-విశ్వక్ సేన్ వివాదంపై మంత్రి దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్!
ఇక తాజా వివాదంలో.. దేవి నాగవల్లి, విశ్వక్‌ని ఉద్దేశించి పాగల్ శీను, డిప్రెస్డ్ పర్సన్ అన్నది. దాంతో వివాదం రాజుకుంది. ఏకంగా F పదాలు వాడే వరకు వెళ్లింది. ఈ వివాదం నేపథ్యంలో నెటిజనులు మరోసరి దేవి నాగవల్లికి సంబంధించిన గత వివాదాలను బయటకు తీస్తున్నారు. మొత్తానికి అటు న్యూస్ ఫీల్డ్‌లో కానీ.. ఇటు ఇండస్ట్రీలో కానీ.. ఏ యాంకర్ మీద కూడా ఈ స్థాయిలో నెగిటివిటీ రావడం, ట్రోలింగ్‌కు గురవ్వడం జరగలేదు. ఈ వివాదానికి సంబంధించి విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు. ఇక దేవి నాగవల్లి.. దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేసింది. మరి చివరకు ఈ వివాదానికి ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Vishwak Sen- Devi Nagavalli: ముదురుతున్న విశ్వక్ సేన్- దేవీ నాగవల్లి వివాదం!