టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్రాండ్ విలువను టాప్‌లో ఉంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా తప్పుకున్నా కూడా కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూలో మాత్రం అగ్రస్థానంలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఇండియన్ నంబర్ వన్ సెలబ్రెటీ విరాట్ కోహ్లీనే. దీంతో వరుసగా ఐదేళ్ల పాటు టాప్‌లో ఉన్నాడు కోహ్లీ. 2017 నుంచి గతేడాది వరకు అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ 185.7 మిలియన్ డాలర్లు. 2020తో పోల్చుకుంటే అతని బ్రాండ్ విలువ తగ్గింది.
2020లో 237.7 మిలియన్ డాలర్లుగా ఉన్న బ్రాండ్ వేల్యూ 185.7లకు తగ్గింది. టాప్ 10లో ఉన్న మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీల జాబితాను డఫ్ అండ్ ఫెల్ప్స్ వెల్లడించింది. రెండో స్థానంలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నిలిచాడు. అతని బ్రాండ్ వాల్యూ 158.3 మిలియన్ డాలర్లు. 139.6 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అక్షయ్ కుమార్ మూడో స్థానంలో ఉన్నాడు.’
ఆలియాభట్ బ్రాండ్ విలువ 68.1 మిలియన్ డాలర్లు. బాలీవుడ్ హీరోయిన్లల్లో టాప్ 10లో చోటు దక్కించకున్న యంగెస్ట్ సెలెబ్రిటీ ఆమె మాత్రమే. ఈ లిస్ట్‌లో ఆలియా భట్‌ది నాలుగో ప్లేస్. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బ్రాండ్ విలువ 61.2 మిలియన్ డాలర్లు. తన విలువను ధోనీ పెంచుకోగలిగాడు. 2020లో ఉన్న బ్రాండ్ విలువ 36.3 మిలియన్ డాలర్లు కాగా.. 2021లో ఈ మొత్తం 61.2 మిలియన్ డాలర్లకు పెరిగింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCB కి దొరికిన మరో ABD..! కోహ్లీతో అదే బంధం!
Virat Kohli remains India’s most valuable celebrity despite dip in brand valuation , Dhoni back in the top-5 club and Alia emerges as the most valued female celeb @businessline https://t.co/bVJLvPg10q
— Meenakshi V Ambwani (@meenaambwani) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.