ఫిల్మ్ డెస్క్- అల వైకుంఠపురములో సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలోని పాటలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హమ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో ఐతే అల వైకుంఠపురములో పాటలు రికార్డుస్థాయిలో వ్యూస్ రాబట్టాయి. ఇక అసలు విషయానికి వస్తే.. అల వైకుంఠపురములో మూవీలో అల్లు అర్జున్‌కు చెల్లిగా నటించిన వైష్ణవీ చైతన్య గుర్తుంది కదా.
ఈమె సినిమాలో నటించకముందే యూట్యబ్ లో బాగా ఫేమస్ స్టార్. షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ, వెబ్ సిరీస్‌లతో మంచి క్రేజ్ తెచ్చుకుంది వైష్ణవీ చైతన్య. గత సంవత్సరం లాక్ డౌన్ టైంలో వైష్ణవీ చైతన్య ఫుల్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వైష్ణవీ చైతన్య, షణ్ముఖ్ జశ్వంత్ కలిసి చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రికార్డుస్థాయిలో వ్యూస్ రాబట్టింది.
మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ తరువాత, వైష్ణవీ చైతన్యకుపెళ్లైపోయితుంది. రెండో సీజన్లో కూడా వైష్ణవీనే తీసుకోవాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేశారంటే ఆమెకున్న క్రేజ్ ఎంటో అర్ధం చేసుకోవచ్చు. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్, క్రేజ్‌ను చూసి సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.
ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న బేబీ అనే సినిమాలో వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్‌కేఎన్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం వైష్ణవీ చైతన్య పుట్టినరోజు సందర్భంగా బేబి హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్, నిర్మాత ఇలా అందరూకూడా వైష్ణవీకి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఈ క్రమంలో వైష్ణవి చైతన్య అభిమాని ఒకరు తన ప్రేమను పచ్చబొట్టు వేయించుకుని మరీ చూపించాడు. వైష్ణవీ పేరును టాటూ వేయించుకున్న సదరు అభిమాని వీడియోను చూసిన ఆమె భావోద్వేగానికి లోనైంది. మాటలు రావడం లేదు.. ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఐ లవ్యూ సో మచ్.. అంటూ వైష్ణవీ చైతన్య ఎమోషనల్ అయ్యింది. ఇంత ప్రేమించే అభిమానులుండటం తన అదృష్టమని చెప్పింది.