సాధారణంగా ఏవరైన అద్భుతమైన పని చేస్తే.. ఏం బుర్రరా నీది..! అని అసాధారణ ప్రతిభాపాటవాలు, అమోఘ నైపుణ్యం కనబరుస్తున్నావు అంటూ ప్రశంసిస్తుంటాం. అలాగే ఓ వ్యక్తి అతి తెలివితేటలను చూసిన పోలీసులు సైతం ఇలానే ఆశ్చర్యపోయారు. కాకపోతే చదువుల్లో ఇతనికున్న ప్రతిభను చూసి కాదు… వక్రమార్గంలో సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షను గట్టెక్కడానికి ఆ మేధావి ఎంచుకున్న హైటెక్ కాపీయింగ్ పద్ధతిని చూసి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల సబ్–ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పోటీ పరీక్షలు జరిగాయి. ఓ అభ్యర్థి దిలాసాగా నడుచుకుంటూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లబోతుండగా… అందరినీ చెక్ చేసినట్లే పోలీసులు అతడిని కూడా మెటల్ డిటెక్టర్ తో చెక్ చేశారు. తల దగ్గరికి రాగానే డిటెక్టర్ శబ్దం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు నిశితంగా పరిశీలించారు. అతడి తలపై ఉన్న విగ్గును తొలగించడంతో లోపలున్న బ్లూటూత్ పరికరం బయటపడింది. అతి కష్టం మీద చెవుల్లోని సూక్ష్మమైన ఇయర్వ ఫోన్ లను పోలీసులు వెలికితీశారు.
దీనికి సంబంధించిన వీడియో చూసి… వామ్మో ఏం తెలివిరా నాయనా నీది… చీటింగ్‌లో నీకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు తెలుసా అని నెటిజన్లు అంటూ నివ్వెరపోతున్నారు. గూఢచారి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని సరదాగా కొందరు అతనికి సూచించారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
#UttarPradesh mein Sub-Inspector
की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry— Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021