చిట్టి గుండె ఒక్కసారిగా ఊపిరి తీస్తోంది. ఇటీవల కాలంలో గుండె పోటుతో అనేక మంది చనిపోయారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం ఈ గుండె పోటుతో మరణిస్తున్నారు. మరో గుండె ఆగింది. సరదాగా, ఆడుతూ పాడుతూ స్నేహితులతో గడిపిన కొన్ని క్షణాలకే తుది శ్వాస విడిచాడో యువకుడు.
రోడ్డు ప్రమాదాల కన్నా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. 40 ఏళ్లు కూడా నిండకుండానే మరణిస్తున్నారు. చిన్న పిల్లల నుండి
వృద్దుల వరకు హార్ట్ ఎటాక్‌తో మృత్యువాత పడుతున్నారు. నటుడు తారకరత్నతో సహా ఇటీవల అనేక మరణాలు చోటుచేసుకున్నాయి. కాలేజీకి వెళుతూ ఓ
విద్యార్ధి, పెళ్లికి హాజరైన ఓ మధ్య వయస్కుడు, జిమ్‌కు వెళ్లిన ఓ యువ పోలీసు, సినిమా చూస్తూ సాఫ్ట్ వేర్ గుండెపోటుతో చనిపోయిన వారే. సైలెంట్‌గా వచ్చి వయలెంట్‌గా మారుతోంది. చిట్టి గుండె ఒక్కసారిగా ఊపిరి తీస్తోంది. తాజాగా మరో చోట ఓ మైనర్ సైలెంట్ హార్ట్ స్ర్టోక్ తో తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని మహాంకాళేశ్వర్ దేవాలయంలో పూజారి మంగ్లేష్ శర్మ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి 17 ఏళ్ల కుమారుడు సైలెంట్ హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయాడు. రంగ పంచమి సందర్భంగా దేవాలయంలో ‘మహాకాల్ ధ్వజ్ చల్’ వేడుకను నిర్వహించారు. ఆ వేడుకలో మయాంక్ హుషారుగా పాల్గొన్నాడు. కత్తితో యుద్ద నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఉత్సవం ముగిన వెంటనే అతడికి కొంచెం అసౌకర్యంగా అనిపించి ఇంటికి బయలు దేరారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం మయాంక్ 11వ తరగతి చదువుతున్నాడు.
చేతికొచ్చిన కొడుకు కళ్లముందే చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేడుకల్లో అతడు ప్రదర్శించిన యుద్ద విన్యాసాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అతడు సైలెంట్ హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు వైద్యలు నిర్దారించారు. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ లో చాలా తక్కువ లక్షణాలు ఉంటాయని, గుండెపోటుగా గుర్తించమలేమని వైద్యులు చెబుతున్నారు. శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పిగా అనిపించడం దీని లక్షణాలని తెలిపారు. చాలా సార్లు, సైలెంట్ హార్ట్ ఎటాక్‌లను ఎదుర్కొన్న వారు తమకు గుండెల్లో మంట, ఫ్లూ, ఛాతీ కండరాల్లో ఇబ్బందిగా ఉన్నట్లు వెల్లడించారన్నారు. ఇది కూడా గుండె పోటులానే ఉంటుందని, గుండెకు రక్త ప్రసరణను అడ్డుకోవడం, గుండె కండరాలకు హాని కలిగిస్తాయని వెల్లడించారు.
#WATCH | Mayank Sharma, the poojari 17-year-old son, died after performing sword fighting at the #Ujjain Mahakal temple flag ceremony. According to the doctors, Mayank had a silent heart attack.#MadhyaPradesh #heartattack #SuddenDeath #SuddenDeaths2023 #viral #India #viralvideo pic.twitter.com/OrDwAVF8uU
— Siraj Noorani (@sirajnoorani) March 13, 2023