రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన పండగల్లో దసరా ఒకటి. ఇక ఆ పండగ రానే వచ్చేసింది. ఈ క్రమంలో సొంత ఊరిలో జరుపుకోవడానికి ప్రజలు పట్టణాల నుంచి భారీగా తరలి వెళ్లనున్నారు. ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు, గ్రామాలకు వెళ్లే వారి సంఖ్యగా భారీగా ఉంది. దీంతో రైల్వే శాఖ, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ఇక పలు ప్రాంతాల్లో నుంచి ఆర్టీసీ బస్సులను ప్రజలకు అందుబాటులో నడపనున్నారు. దసరా పండగ సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త కూడా చెప్పింది.
దసరా పండగా కోసం సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని మొత్తం 3500కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ లతో పాటు దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, అమీర్ పేట్, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులను బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలో పండగ సీజన్లలో ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు.
దీంతో ప్రజలు ఇతర వాహనాల్లో వెళ్లేందు ఆసక్తి చూపించే వారు. అయితే సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ సంస్థలో అనేక మార్పులు వచ్చాయి. అలాంటి మార్పులో ఇది ఒకటి. పండుగల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నారు. ప్రయాణికులకు ఆర్టీసీని మరింతగా చేరువ చేసేందుకు సజ్జనార్ ఈ నిర్ణయం తీసకున్నారు. ఈ దసరా కూడా స్పెషల్ బస్సులకు సాధారణ ఛార్జీలే ఉండనున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
ఆలస్యం అమృతం విషం, ఈసారి ప్రయాణం ఆదరబాదరగా వద్దు .. పక్కా ప్రణాళికతో #TSRTCBus లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకొని వెళ్దాం.. pic.twitter.com/DAt5qgB8OZ
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) September 19, 2022