దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు తెస్తున్నా, ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా.. మృగాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఒక చోట నిత్యం స్త్రీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన గుంటూరు రమ్య హత్య ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ఈ ఉదంతంపై సినీ సెలబ్రెటీలు కూడా ఒక్కొక్కరిగా పెదవి విప్పుతున్నారు. మొన్నటికి మొన్న మంచు మనోజ్ రమ్య హత్య విషయంలో స్పందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా.., మరో తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ కూడా ఈ కేసు విషయంలో సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ తన ఫేస్ బుక్ పేజీలో రమ్య హత్యోదంతంపై తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకి తెరలేపింది. “రమ్య చావుకి కారణమైన వాడిని కూడా ఎవరైనా అలానే నరికేస్తే.. ఆ నరికిన వాడితో నేను పడుకుంటా. ఐ యామ్ సారీ.. ఆ వీడియోలోని విజువల్స్ చూశాక ఏమి మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. అంత నిస్సహాయతలో ఉన్నాను. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి. రమ్య నీకు న్యాయం జరగాలి” అంటూ రేఖ తన బాధని అంతా పోస్ట్ లో చెప్పుకొచ్చింది. దీనికి.., ఊసరవెల్లి సినిమాలో తమన్నా.. తనకు సాయం చేస్తే పడుకుంటా అంటూ ఆవేదనతో డైలాగ్ చెప్పే ఇమేజ్ ని యాడ్ చేసింది రేఖ. రమ్యకి జరిగిన దారుణాన్ని చూసి.., రేఖ భోజ్ ఇలా మాట్లాడి ఉండొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ హీరోయిన్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.