హైదరాబాద్- తెలంగాణలో ఈ రోజు మరో రాజకీయ పార్టీ ఆవిర్బవించబోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజఖేశర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ లోని జేఆర్ సీ కన్వేన్షన్ సెంటర్ లో ఆమె తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎఎస్ ఆర్ తెలంగాణ పార్టీ గా నామకరణం చేశారు.
కొత్త పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండానుషర్మిల ఆవిష్కరించబోతున్నారు. ఆవిర్భావ కార్యక్రమంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొంటున్నారు. గురువారం ఉదయం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి ముందు పార్టీ జెండాను ఉంచి ఆశీర్వాదం తీసుకుంటారు షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయలక్ష్మి, పార్టీ ముఖ్యనేతలు కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి ఇడుపులపాయ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ తరువాత ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల, వైఎస్ విజయలక్ష్మి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ లోని జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ కు ర్యాలీగా వెళతారు. సాయంత్రం 4 గంటలకు షర్మిల కొత్త పార్టీ పేరును ప్రకటించి, పార్టీ జెండానూ ఆమె ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా తన తల్లి వైఎస్ విజయలక్ష్మి ఆశీర్వాదం ఆమె తీసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు షర్మిల సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో తాను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, తన పార్టీ ఎజెండా ఎంటన్నదానిపై షర్మిల ప్రసంగించనున్నారు.