చెన్నై- తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ వార్డెన్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్ తనను క్రైస్తవ మతంలోకి మారాలని దారుణంగా వేధించారని ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో పోలీసు వాంగ్మూలంలో తెలిపింది.
తంజావూరులోని సెయింట్ మైఖేల్స్ గర్ల్స్ హోంలో ఉంటూ పన్నెండో తరగతి చదువుతోంది పదిహేడేళ్ళ వయసుగల ఈ విద్యార్థిని. ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ 62 ఏళ్ల సకయమరి తనను మతం మారాలని చాలా ఒత్తిడి చేసేవారని ఈ వీడియోలో బాధితురాలు చెప్పుకొచ్చింది. తనను నిరంతరం దూషిస్తూ, తన చేత హాస్టల్ లోని గదులన్నిటినీ తుడిపించేవారని తీవ్ర ఆవేధన వ్యక్తం చేసింది.
చాలా కాలం ఒత్తిడి తరువాత వార్డెన్ ఒత్తిళ్ళను భరించలేక ఆ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి మురుగానందంకు జనవరి 10న తెలియజేశారు. జనవరి 9న వాంతులు అయ్యాయని, ఆమెను ఆసుపత్రిలో చేర్పించామని సమాచారం ఇచ్చారు. ఆమె తండ్రి అక్కడి నుంచి వచ్చి ఆమెను తంజావూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె స్పృహలోకి వచ్చింది.
హాస్టల్ వార్డెన్ తనను మతం మారాలని ఒత్తిడి చేస్తున్నారని, తాను ఆత్మహత్యాయత్నం చేశానని అసలు విషయం చెప్పింది బాధితురాలు. డాక్టర్లు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. హాస్టల్ వార్డెన్ తనను తీవ్రంగా వేధించినట్లు, క్రైస్తవ మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆమె వాంగ్మూలం ఇవ్వడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థిని జనవరి 19 రాత్రి తుది శ్వాస విడిచింది. వార్డెన్ సకయమరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ஏழை விவசாயி மகள் லாவண்யா வயது 27, அரியலூர் தூய இருதய மேல்நிலைப்பள்ளியில் நன்றாகப் படிக்கும், பன்னிரண்டாம் வகுப்பு மாணவி.
இவரை மதம் மாறச் சொல்லி, பள்ளியில் கொடுத்த மன அழுத்தத்தால், விஷம் அருந்தி தற்கொலை செய்து கொண்டுள்ளார். pic.twitter.com/7dDioLpIJE
— K.Annamalai (@annamalai_k) January 20, 2022