కొడుకులను ఉన్నత చదువులు చదివించి వారిని ప్రయోజకులను చేయడం వరకు బాగానే ఉన్న.. వివాహం విషయంలో అమ్మాయి కోసం వారి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తెలిసిన వాళ్లకు చెప్పండ, పెళ్లిళ్ల బోకర్ ను సంప్రదించడం వంటివి చేస్తుంటారు. అయితే కొడుకులకు పెళ్లిళు చేయడం తలకు మించిన భారంగా తల్లిదండ్రులకు మారింది. అదృష్టం బాగుంటే త్వరగా అవుతుంది. కాలం కలసి రాకుంటే చెప్పులు అరిగే వరకు తిరుగుతూనే ఉండాలి. ఈక్రమంలో అసలు మాకు పెళ్లి అవుతుందా? లేదా? అనే సందేహం యువకులకు వస్తుంది. పెళ్లి కావడం లేదని కొందరు యువకులు నిరాశతో కుమిలిపోతుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనతో పెళ్లికోసం ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు తనకు సంబంధించిన వివరాలు మొత్తం ఓ పోస్టర్ల రూపంలో తయారు చేసి ఊరంతా అంటించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదువులు, ఉద్యోగాలు, జీవిత భద్రత అంటూ.. యువతీ, యువకులు సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం లేదు. యువకులకు 28 నుంచి 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. డిగ్రీ చదివితే కనీసం ప్రైవేట్ ఉద్యోగం అయినా వస్తుందనుకుంటే నేటి రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కష్టమవుతున్నాయి. ఆ చదువులు పూర్తయ్యే సరికి పెళ్లి వయస్సు మించిపోతుంది. పెళ్లి కాకపోవడం చాలా మంది యువకు నిరాశకు లోనవుతున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాలోని విళ్లై గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడు పెళ్లి చేసుకోవడానికి పిల్ల కోసం వెరైటిగా ప్రయత్నం చేశాడు. తన వయస్సు, చేస్తున్న ఉద్యోగం, జీవితం వంటి వివరాలతో పోస్టర్లను ఊరంత సందు, గొందుల్లో అతికించాడు. ఆసక్తికి ఉన్నవారు కింది నెంబర్లు సంప్రదించాలంటూ ఆ పోస్టర్లో అతడి నెంబర్ కూడా ఇచ్చాడు. పెళ్లి కోసం ఈ యువకుడు పడుతున్న ఆరాటం చూసి త్వరలో మంచి అమ్మాయితో పెళ్లి కావాలని కోరుకుంటున్నాము అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈవీడియోపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.