దేశ వ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. సుమారు నెల రోజుల నుండి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇప్పుటి వరకు 150 నుండి 180 మధ్య ఊగిసలాడుతున్న టమాటా రేటు.. రూ. 200 పలుకుతుంది.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. సుమారు నెల రోజుల నుండి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇప్పుటి వరకు 150 నుండి 180 మధ్య ఊగిసలాడుతున్న టమాటా రేటు.. ఇప్పుడు హోల్ సేల్ గానే రూ. 200 పలుకుతుంది. ఇక సామాన్యులైతే దీన్ని కొనడం మానేశారు కూడా. అయితే ఇటీవల కొంత మంది ఈ టమాటాలతో వినూత్న ప్రయత్నాలు చేసిన సంగతి విదితమే. కుమార్తె మొక్కు తీర్చేందుకు.. టమాటాలతో తులాభారం వేశాడో తండ్రి. వాటిని గుడికి అందించారు. కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని 400 కేజీల టమాటాలను పంచాడు మరో తండ్రి. మొన్నటి మొన్న కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఉచితంతగా టమాటాలు పంచారు ఆయన అభిమానులు.
ఇప్పుడు ఓ మంచి ప్రయత్నంలో భాగంగా టమాటాలను ఉచితంగా పంచారు ట్రాఫిక్ పోలీసులు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు. డీజిల్, పెట్రోల్ వాహనాలతో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ వినియోగించాలని శనివారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. తంజావూరు మేరీస్ కార్నర్ లో ఓ ప్రైవేటు ట్రస్ట్, ట్రాఫిక్ విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సైకిల్ పై వచ్చిన 50 మందిని అభినందిస్తూ.. ఒక్కొక్కరికి కిలో టమాటాలు బహుమతిగా అందించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి స్థానికులకు తెలిసి సైకిళ్లు తీసుకుని.. వెళ్లినట్లు తెలుస్తోంది.