వరంగల్ క్రైం- ప్రేమ.. ఈ రోజుల్లో సర్వసాధారణంగా వినిపించే పేరు. యువతీ యువకులు ప్రేమించుకోవడం వేరీ కామన్ అని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రేమించిన చాలా మంది యుతులు మోసపోతున్న ఘటనలను మనం చూస్తున్నాం. ఐతే ఇప్పటివరకు అబ్బాయిల చేతిలో మోసపోయిన యువతులనే చూసిన మనం, అప్పుడప్పుడు అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయల గురించి చాలా తక్కువగా విని ఉంటాం. వరంగల్ జిల్లాలో అమ్మాయిలు ప్రేమ పేరుతో వేధించడంతో ఓ యువకుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన మైలపాక సోమయ్య, జయమ్మ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు సందీప్ ఎంఎల్‌టీ కోర్సు చేసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సందీప్ కు ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారడం, ఆ తరువాత ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయితో సందీప్ ప్రేమలో పడిపోయాడు.
ఇంకే ముంది మిగిలిన ఇద్దరు అమ్మాయిలు సందీప్ పై కక్షగట్టారు. వారం పది రోజుల నుంచి అతన్ని మనోవేధనకు గురిచేస్తూ వస్తున్నారు వారిద్దరు. అతడికి ఫోన్ చేసి నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి చనిపోయిందని చెప్పారు. ఆమె చావుకు నువ్వే కారణమని, ఈ విషయాన్ని పోలీసులకు చెబుతామని సందీప్ ను బెదిరించారు. ఈ నెల 12న మరోసారి సందీప్ కు ఫోన్ చేసి ఇదే విషయంపై బెదిరించడంతో తీవ్ర మనోవేధనకు గురయ్యాడు.
వెంటనే స్వగ్రామనాకి వెళ్లి ఇంట్లో పంటచేనుకు వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రతయ్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హన్మకొండలోని హాస్పిటల్ కు తరలించారు. సందీప్ పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పుడే ఏంచెప్పాలేమని డాక్టర్లు తెలిపారు. ఐతే ఈ విషయంపై పోలీసులుకు మాత్రం ఎటువంటి కంప్లైంట్ అందలేదు.