‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆట రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ప్రియ ఎలమినేషన్‌తో అందరూ డీలా పడ్డారు. ప్రియాంక సింగ్ అయితే ప్రియ కోసం విపరీతంగా ఏడ్చేసింది. హౌస్‌లో అప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగిన ప్రియ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది? ప్రియ ఎలిమినేషన్‌కు కారణాలు ఏంటి? ప్రియ ఎలిమినేషన్ వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? ప్రియ కావాలనే ఎలిమినేట్ అయ్యిందా? ఎలిమినేట్ కావాల్సి వచ్చిందా? అని పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.
నటి ప్రియ హౌస్‌లోకి ఎంటర్ అయిన సమయంలో పెద్దగా అంచనాలు లేవు. మహా అయితే ఒక 3 వారాలు ఉంటుందేమో అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రియ 50 రోజులు హౌస్‌లో కొనసాగింది. అక్కడ ఉన్న ఎందరో ప్లేయర్ల కంటే చాలా మెరుగ్గా రాణించింది. టాస్కు కానివ్వండి.. ఇంట్లోని సభ్యులతో మెలగడం కానివ్వండి ఎంతో హుందాగా ఉంది ప్రియ. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని లిమిట్‌లో ఉంచాలి.. ఎవరితో క్లోజ్ గా ఉండాలి అని స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. తన గేమ్ స్ట్రాటజీ కూడా ఎంతో గొప్పగా ఉండేది.
రవి- ప్రియ- లహరి మధ్య జరిగిన గొడవ పెద్ద దుమారమే రేపింది. నాగార్జున వీడియో ప్లేచేసి చూపించాక అసలు విషయాలు వెలుగు చూశాయి. రవి- లహరిని అక్కడ, అలా చూశాను అని ప్రియ చేసిన కామెంట్ ఆమెకు పెద్ద చెడ్డ పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీడియో చూశాక లహరికి క్లారిటీ వచ్చింది. ప్రియను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పింది. రవి ఆడిన అబద్ధం అతని గేమ్ ప్లేతో ఆ సమయంలో ప్రియ బలైంది. ప్రేక్షకులకు కూడా క్లారిటీ రావడానికి టైమ్ పట్టింది.
ఇదీ చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గురించి మీకు తెలియని విషయాలు!
ప్రియను ప్రేక్షకులు హేట్ చేయడానికి సన్నీతో గొడవ కూడా కారణం అని చెప్పాలి. మొదటి నుంచి ప్రియ- సన్నీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రతిసారి ఇద్దరూ నామినేట్ చేసుకోవడం కూడా చూస్తుంటాం. సన్నీని మగాడివైతే ఆడు అనడం.. తాజా టాస్కులో చెంప పగలకొడతా అంటూ కామెంట్ చేయడం. అతడిని బాగా ప్రవోక్ చేయడం జనాలకు అంతగా నచ్చలేదు. అది కూడా మైనస్ అయ్యింది.
ప్రియ దాదాపు 40 రోజుల వరకు ఎంతో హుందాగా గేమ్ ఆడింది. చివరి పది రోజుల్లో మాత్రం ఎంతో వింతగా ప్రవర్తించింది. కావాలని అలా చేసిందా? అలా చేయాల్సి వచ్చిందా అని మాత్రం తెలియకపోయినా.. ఆమె గేమ్‌లో మాత్రం మార్పు కనిపించింది. అప్పటి వరకు అంత బాగా ఆడిన ఆమె ఎందుకు గేమ్ ఛేంజ్ చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. కుటుంబ సభ్యులను మిస్ అవ్వడం కారణంగా ఇంక ఇంట్లో ఉండలేక అలా చేసిందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ప్రియను ఎలిమినేట్ చేయాలి కాబట్టే అలా ప్లాన్ చేశారు అని కూడా కొందరు భావిస్తున్నారు. అసలు కారణాలు ప్రియ, బిగ్ బాస్‌లకు మాత్రమే తెలుస్తాయి. ప్రియ ఎలమినేషన్ వెనుక కుట్ర జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: మీడియా సమావేశంలో కోహ్లీ సీరియస్.. జర్నలిస్టు ప్రశ్నకు ఘాటు రిప్లై