స్పెషల్ డెస్క్- తమిళనాడు రాష్ట్రం హిందూ దేవాలయాలకు పెట్టింది పేరు. దేశంలో అత్యధికంగా ఆలయాలు తమిళనాడులోనే ఉన్నాయి. ప్రముఖ దేవాలయలు తమిళనాడులో ఉండటంతో కడవల్ గ్రామం.. అంటే దేవతల ఊరు అని పిలుస్తుంటారు. ఇక తమిళనాడులోని ఒక్కో దేవాలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఇక్కడి ఆలయాలకు చారిత్పక నేపధ్యం ప్రత్యేకం అని చెప్పవచ్చు.
తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుపళనం ఆపత్ సహాయేశ్వరర్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వేస్తున్న తాళం పాతదవ్వడంతో కొత్త తాళాన్ని తయారుచేయిస్తున్నారు. తమిళనాడులోని దిండుగల్‌లో 40 కిలోల బరువుతో తాళం తయారవుతోంది. దీని తాళం చెవి 2 కిలోల బరువుతో ఉండనుంది. తాళం పొడవు 18 అంగుళాలు, వెడల్పు 12 అంగుళాలు. ఇక ఈ భారీ తాళం విలువ 30 వేల రూపాయలు.
ఆపత్ సహాయేశ్వరర్ ఆలయానికి మరో 10 కిలోలు, 4 కిలోలు బరువు కలిగిన రెండు తాళాలు కూడా తయారవుతున్నాయి. తాళం తయారీదారుడు శేఖర్ మాట్లాడుతూ, యంత్రం సహాయం లేకుండా పారం పర్యంగా 40 ఏళ్లుగా తాళాలు తయారు చేస్తున్నామని, ఆపత్ సహాయేశ్వరర్ ఆలయానికి తయారు చేసే తాళం 10 లీవర్లు కలిగివుందని, తయారీకి 15 రోజులు పడుతుందని చెప్పారు. ఈ బారీ తాళంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.