జమ్మూ కాశ్మీర్.. భారత భూభాగానికి తల వంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని దక్కించుకోవాలని ఉగ్రమూక కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ.., వెన్ను చూపని మన వీర సైనికులు ఎప్పటికప్పుడు వారి ఎత్తులను తుత్తునియలు చేస్తూనే ఉన్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిలు దారుణంగా ఉండేవి. అక్కడ సామాన్య జనంలో ఉగ్రవాదులు కలసిపోయి ఇండియన్ సోల్జర్స్ కి, పోలీసులకి కొరకరాని కొయ్యలా మారుతూ వచ్చారు. అయితే.., ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం అంటూ ఏమి లేకుండా పోయింది. దీంతో.., ఉగ్రమూకని ఏరివేయడానికి మన సైనికులకు కావాల్సినంత స్వేచ్ఛ దొరికింది. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల కాలంగా జమ్మూ కాశ్మీర్ లో నివశిస్తున్న ప్రజలకి మళ్ళీ జీవం వచ్చింది.
ఒకవైపు సైన్యం ఇంతలా జల్లెడ పడుతూనే ఉన్నా.., జమ్మూ కాశ్మీర్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ శనివారం తెల్లవారుజామున కూడా శ్రీనగర్ లో కొంతమంది ఉగ్రవాదులను పట్టుకున్నారు సైనికులు. అయితే.., వీరి నుండి ఒక ఉగ్రవాది తప్పించుకుని బైక్ పై దూసుకుపోయాడు. ఇక పోలీస్ వాహనంలో సైనికులు అతని వెంబడించారు. వాహనం అతన్ని సమీపించగానే పారిపోతున్న ఉగ్రవాదిని ఒక జవాన్ ఎగిరి కాలితో తన్ని ఆ ఉగ్రవాదిని పట్టుకున్నాడు. ఈ మొత్తం మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న సామాన్య జనం తమ సెల్ ఫోన్స్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ ఉగ్రవాదిని మన జవాన్ ఎగిరి తన్నిన షాట్.. సినిమాలో హీరో విలన్ ని తన్నేలా, సూపర్ గా ఉండటంతో నెటిజన్స్ ఆ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి సరిగ్గా ఒక్క రోజు ముందు మన సైనికులు ఇంతలా తెగువ చూపించడంతో అంతా వారికి సెల్యూట్ చేస్తున్నారు. మరి.., ఆ వీడియోని మీరు కూడా చూసి.., మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.