తమిళనాడు– గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.. అన్నారు పెద్దలు. అంటే మన దేశంలో గరువును భగవంతుడితో సమానంగా పోలుస్తామన్నమాట. మరి గురువుకు అంతటి మహోన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు పిల్లలను గురువులు సైతం అంతే ప్రేమగా చూసుకోవాలి. విధ్యార్ధులంతా గురువులను తమ సొంత పిల్లలతో సమానం.
కానీ ఓ గురువు మాత్రం విచక్షణ కోల్పోయి, పిల్లలను దారుణంగా కొట్టాడు. గురువు అనే పదానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడు. తమిళనాడులోని ఓ ఉన్నత పాఠశాలలో అలాంటి ఓ గురువు కెమెరాకు చిక్కాడు. ఓ విద్యార్థిని జుట్టుపట్టుకుని కింద పడేసి బెత్తంతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. విచక్షణారహితంగా కాళ్లతో తన్నాడు. ఈ దృష్యాలను తోటి విద్యార్థి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది.
చిదంబరం జిల్లాలోని దురై కలియమూర్తి నగర్ లో ఉన్న నందనార్ బాలుర పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని కొడుతున్న టీచర్ పేరు సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. స్కూల్ కు సరిగా హాజరు కావడం లేదనే కోపంతో మొత్తం ఏడుగురు 12వ తరగతి ఫిజిక్స్ విద్యార్థులను టీచర్ ఇష్టం విచక్షణారహితంగా కొట్టాడు.
ఈ వీడియోను కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబర్ తనయుడు కార్తీ చిదంబరం తన ట్విటర్‌లో షేర్ చేశారు. విద్యార్థులను ఇలా హింసించే అధికారం ఏ ఉపాధ్యాయుడికీ లేదని, ఈ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ట్వీట్‌లో తమిళనాడు విద్యాశాఖను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పాఠశాల ఇంచార్జ్, కేర్‌టేకర్ సెల్వ పాండ్యన్ విచారణకు ఆదేశించారు. విచారణ తరువాత సుబ్రహ్మణ్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
There is no place for corporal punishment in our school system. Strict action must be taken against the teacher. @Anbil_Mahesh https://t.co/WydDFmT55b
— Karti P Chidambaram (@KartiPC) October 14, 2021