వివాహేతర సంబంధాలకి నిండు ప్రాణాలు బలి అయిపోతున్నాయి. ఈ విషయంలో మగవారు మాత్రమే కాదు ఆడవారు కూడా విచక్షణ మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని వేలూరు సమీపంలో బాలూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఢిల్లీబాబు, అతని భార్య లక్ష్మి దోబీ దుకాణం నడుపుతు జీవిస్తున్నారు. ఢిల్లీబాబు తన ఇంటి ముందే ఈ దుకాణాన్ని పెట్టుకుని, బట్టలు ఐరెన్ చేస్తూ పగటిపూట చాలా బిజీగా ఉంటాడు. ఎంత పని ఉన్నా.., భార్యని మాత్రం కష్ట పెట్టేవాడు కాదు. భార్య లక్ష్మీని మాత్రం ఇంట్లోనే ఉంచేవాడు. కానీ.., భర్త మంచితనాన్ని ఆసరాగా చేసుకుని అతన్నే మోసం చేసింది ఆ భార్య.
బాలూరు గ్రామానికే చెందిన గోవిందస్వామితో ఢిల్లీబాబు భార్య లక్ష్మీకి ఫోన్ లో పరిచయం అయ్యింది. రోజంతా ఇంట్లో ఖాళీగా ఉండటంతో టైమ్ పాస్ కోసం లక్ష్మీ.. గోవిందస్వామితో మాటలు కలిపింది. ఆ తరువాత అతనికి శారీరికంగా కూడా దగ్గర అయ్యింది. ఇక.., గోవిందస్వామిని వదిలి ఉండలేని స్థితికి వచ్చేసింది లక్ష్మీ. దీంతో.., ఆమె ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.
ఇంటి ముందు భర్త ఢిల్లీ బాబు చాకిరీ చేస్తుంటే.. ఆమె పట్టించుకునేది కాదు. పైగా.., ఇంట్లోకి దుమ్ము వస్తుందంటూ ప్రధాన వాకిలికి గొళ్ళెం పెట్టడం మొదలు పెట్టింది. ఇంటి వెనక వైపు నుండి ప్రియుడు గోవిందస్వామిని పిలుచుకుని రోజు బెడ్ రూమ్ లోనే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది. ఒకవేళ ఢిల్లీబాబు ఇంట్లోకి రావాలన్నా కాలింగ్ బెల్ కొట్టాలి కాబట్టి.., లక్ష్మీ కామ క్రీడలకు హద్దే లేకుండా పోయింది. ఇలా.. కొంతకాలం వీరి వ్యవహారం బాగానే నడిచింది.
అయితే.., భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చిన ఢిల్లీబాబు ఈ మంగళవారం రాత్రి 10 గంటలకు కావాలనే ఇంటి నుండి బయటకి వెళ్ళాడు. భర్త బయటకి వెళ్లాడనుకున్న లక్ష్మీ ప్రియుడిని పిలుచుకుని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది. కానీ.., ఈసారి ఢిల్లీబాబు కాలింగ్ బెల్ నొక్కకుండా, ఇంటి వెనక భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. బెడ్ రూమ్ తలుపు తీసి చూడగా.. గోవిందస్వామితో తన భార్య దారుణమైన స్థితిలో కనిపించింది. దీంతో.., ఆగ్రహించిన ఢిల్లీబాబు కత్తితో గోవిందస్వామిపై దాడి చేశాడు.
దాడిలో గోవిందస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య మీద కూడా ఢిల్లీబాబు హత్యాయత్నానికి ప్రయత్నించినా.., ఆమె మరో గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని తృటిలో తప్పించుకుంది. దీంతో.., ఢిల్లీబాబు అక్కడ నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని నిందితుడు కోసం గాలిస్తున్నారు. మరి.., కష్టపడి సంసారాన్ని నడిపిస్తున్న భర్తని కూడా మోసం చేస్తున్న ఇలాంటి భార్యలకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.