మానవత్వం మంట కలసి పోతోంది. సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఘటనలు రోజు ఎక్కడో, ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అతి నీచమైన ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు అనూష. చిన్న తనంలోనే అమ్మ, నాన్నకి కోల్పోయింది. దీంతో.. ఆమె బాధ్యతని పెద్దనాన్న తీసుకున్నాడు. కానీ.., సొంత కూతురులా పెంచి పెద్ద చచేయాల్సిన పెద్ద నాన్న అనూషని ఇంట్లో పని మనిషిని చేశాడు. ఆమె చుట్టూ ఉన్న మిగతా మృగాలు.. అనూష శరీరాన్నే గమనిస్తూ వచ్చాయి. వావి వరుసలు మరచి, గుంట నక్కల్లా ఆమె చుట్టూ తిరుగుతూనే వచ్చాయి.
చివరికి అనూషకి ఎవరి అండ లేకపోవడంతో ఆమె బాబాయ్ పగిడిమర్రి విజయ్ కూతురు వరుసయ్యే అనూషని గర్భవతి చేశాడు. తన కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. పెద్దనాన్న కొడుకుకి చెప్పుకుంది అనూష. అన్నయ్య స్థానంలో ఉండి, ఆదుకోవాల్సిన ఆ మూర్ఖుడు కూడా అనూషపై కన్నేశాడు. ఆమెని లైంగికంగా వేధించాడు.
ఈ సంఘటనలతో మానసికంగా కృంగిపోయిన అనూష.. తనకి జరిగిన అన్యాయాన్ని ఓ లెటర్ లో రాసి, తనువు చాలించింది. దీంతో.. కుటుంబ సభ్యలపై చర్యలు తీసుకోవాలని పత్తేపురం గ్రామస్థులు ఆందోళనకి దిగారు. అనాధగా మారిన అనూషకి బతికినంత కాలం నరకం చూపించిన ఆ కుటుంబ సభ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.