బుల్లితెర డెస్క్- సుడిగాలి సపధీర్.. జబర్దస్త్ కామెటీ షో ప్రేక్షకులకు, ఢీ డ్యాన్స్ షో ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతకు ముందు మ్యాజిక్ షో లు చేస్తూ వచ్చిన సుధీర్.. జబర్దస్త్ షోకు వచ్చాక బాగా పాపులర్ అయ్యాడు. తన పేరుకు ముందు సుడిగాలి అని నిక్ నేమ్ పెట్టుకున్నాక వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
జబర్దస్త్ కామెడీ షోలో ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్తో నవ్విస్తూ వస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇక చాలా రోజులుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సుడిగాలి సుధీర్ పెళ్ళిపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ మాత్రం జబర్దస్త్ యాంకర్, నటి రష్మీ పై మనసు పారేసుకున్నాడని, అందుకే పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఇదిగో ఇటువంట సమయంలో సుధీర్ పెళ్లి గురించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తోంది. తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లిపై అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ వయస్సు ఇప్పటికే 34 ఏళ్ళు దాటిపోవడంతో ఇక ఆలస్యం చేయకూడదని, పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు సమాచారం.
సుధీర్ కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఓ సంబంధం దాదాపు ఖరారైందని జబర్దస్త్ టీంలీడర్ల ద్వార తెలుస్తోంది. ఈ పెళ్లి సంబంధం సుధీర్ కు బాగా నచ్చి ఓకే కూడా చెప్పేసినట్లు చెబుతున్నారు. సుధీర్ కు నచ్చిన అమ్మాయి అతని సొంత జిల్లాకు చెందిన యువతేనట. అంతే కాదు ఆమె ఇంజినీరింగ్ చదువుకుందని తెలుస్తోంది. మరి తన పెళ్లి వార్తను సుడిగాలి సుధీర్ అధికారికంగా ఎపుడు చెబుతాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.