ఆస్ట్రేలియాలో అతి పొడవైన సాలెగూళ్ల దుప్పటి ఒకటి వెలుగు చూసింది. అది ఎలా వచ్చిందో తెలుసా!? వరదల వల్ల. ఇటీవల భారీ వరదలు సంభవించాయి. వరదల నుంచి తప్పించుకోవడానికి సాలీళ్లు పొడవైన గూళ్లను అల్లుకున్నాయి. వాటిని రక్షణ కవచాళ్లా ఉపయోగించుకున్నాయి సాలీళ్లు. వరదలు వచ్చినా కొట్టుకుపోకుండా ఉండేందుకు బెలూన్ల మాదిరిగా గూళ్లను అల్లుకున్నాయి. సాలెగూళ్లతో చెట్లు, కంచెలు అన్నీ కప్పుకుపోయాయి. అయితే, విక్టోరియా గిప్స్లాండ్ ప్రాంతంలో వరదలతో దుప్పటిలా పరుచుకున్న పాలెగూళ్లు బయటపడ్డాయి. వాటి సాయంతో లక్షల కొద్ది సాలీళ్లు బయటపడ్డాయని పరిశోధకులు అంటున్నారు. బెలూనింగ్ పద్ధతిలో సాలీళ్లు అధిక ఎత్తులకు ఎగిరేందుకు పట్టు దారాన్ని గాలిలోకి విసురుతాయని చెప్పారు. దాని ఫలితంగానే ఇలాంటి విస్తారమైన సాలెగూళ్లు ఏర్పడ్డాయని పరిశోధకులు చెప్తున్నారు. “కొన్ని లక్షల సాలీళ్లు కలిసి సిల్కు దారాలను చుట్టు పక్కల ఉన్న చెట్లపైకి విసిరి ఉంటాయి. అవన్నీ సమన్వయంతో ఒకదానికొకటి కలపడం వల్లే ఇంత పెద్ద సాలెగూడు సాధ్యమయింది” అని విక్టోరియా మ్యూజియంలో సీనియర్ ఇన్సెక్ట్స్ క్యూరేటర్ డాక్టర్ కెన్ వాకర్ చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర సాలెగూళ్లు విస్తరించి ఉన్నాయి. సాలీళ్లు భూమిపై నుంచి వేగంగా తప్పించుకుని చెట్లపైకి చేరడానికి దుప్పటి వలె పరుచుకున్న వల ఉపయోగపడిందని డాక్టర్ కెన్ వారన్ తెలిపారు. వరద సమస్యలే కాకుండా పెరుగుతున్న సాలీల్ల సంఖ్య మూలంగా ఆహారం కోసం వాటి మధ్య పోటీ ఏర్పడిందని, సాలీళ్లు ఇతర ప్రాంతాలకు వేగంగా వెళ్లడానికి ఈ పొడవైన వలలను మార్గంగా నిర్మించుకున్నాయని పేర్కొన్నారు. ఈ సాలె గూళ్ల వల గాలికి అలల మాదిరి కదులుతుండటంతో సాలీళ్లు వేగంగా కదిలి చెట్ల పైకి చేరడానికి అవకాశం ఉందన్నారు. మొత్తానికి తమకు తాము రక్షించుకునే పరిస్థితిలో అందమైన అల్లికను సృష్టించిన సాలీళ్లకు సలాం చెప్పాల్సిందే.