సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు అంటే జనాలు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొన్ని సైట్లు, యూట్యూబ్ చానెల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తాయి. తాజాగా సింగర్ సునీతకు సంబంధించి ఇలాంటి తప్పుడు వార్త ఒకటి ప్రచారం అవుతోంది. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ ఘాటుగా స్పందించారు. ఆ వివరాలు..
సింగర్ సునీత.. ఆమె పాట వింటూ.. అలా ఆదమరిచి పోవచ్చు. దేవుడు ఆమె గొంతులో అమృతం నింపాడా అన్నంత మధురంగా ఉంటుంది. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది సునీత. సుమధరమైన గాత్రంతో పాటు.. అందమైన రూపం సునీత సొంతం. ఇక సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రెండేళ్ల క్రితం సునీత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్నారు. సునీతకు మొదటి భర్త ద్వారా ఇద్దరు సంతానం ఉన్నారు. అబ్బాయి సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. సునీత కుమార్తె కూడా సింగర్‌గా రాణించే ప్రయత్నం చేస్తోంది.
ఇక వివాహమైన దగ్గర నుంచి సునీతకు సంబంధించి ఏదో వార్త వైరలవుతూనే ఉంది. ఆమె వ్యక్తిగత అంశాలకు సంబంధించి కూడా తప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె తల్లి కాబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే సునీత ప్రెగ్నెంట్ అంటూ ఇలా పుకార్లు పుట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఆమె కొట్టిపారేస్తు వస్తున్నారు. అలానే తాజాగా వచ్చిన పుకార్లపై కూడా సునీత స్పందించారు.
తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తోన్న వార్తలపై సునీత స్పందిస్తూ.. ‘‘నేను గర్భవతినా.. నాకే తెలియదే.. ఇలాంటి రూమర్లు సృష్టించిన వారి ఆలోచనా స్థాయి ఎంత నీచంగా ఉందో అర్థం అవుతుంది. ఇది వారి జీవితానికి సంబంధించిన అంశం అయ్యుండొచ్చు కానీ.. నాకు, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం మాత్రం కాదు’’ అంటై తనపై వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టారు సునీత. ఈ నెల 26న తేదీన హైదరాబాద్ వేదికగా మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ ప్రొగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. తన ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందిస్తూ కొట్టి పారేశారు. ఈ కన్సర్ట్‌లో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు సునీత.
ఇక సునీత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ బాబు సినిమాలో ఆయనకు అక్క పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. మరి అవి నిజమో కాదో తెలియదు. ఇక సునీత కుమారుడు సర్కారు నౌకరి చిత్రం ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్‌కే టెలీషో బ్యానర్‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సునీత కెరీర్‌లో చాలా బిజీగా ఉంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ నందిని పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పారు. మరి సెలబ్రిటీల మీద ఇలాంటి తప్పుడు వార్తలు.. అది కూడా వారి వ్యక్తిగత జీవితాల గురించి రూమర్లు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి