టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. మూడోసారి ఒలింపిక్స్ ఆడుతూ, సెమీస్ చేరింది. 1980లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళా జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.ఆట ప్రారంభమైన తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్‌లో 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సరిగ్గా వినియోగించుకున్న గుర్జిత్ కౌర్, గోల్ సాధించి టీమిండియాకి 0-1 తేడాతో ఆధిక్యం అందించింది. టోక్యో ఒలింపిక్స్ లో ఇండియన్ వుమెన్స్ హాకీ టీమ్ అదరగొడుతోంది.
పటిష్ఠమైన ఆస్ట్రేలియాను చిత్తు చేసి సమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఈ చారిత్రక సందర్భాన్ని రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చాడు కోచ్ సోయెర్డ్ మరీన్. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన చక్ దే ఇండియా మూవీ అప్పట్లో సెన్సెషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల హాకీ ఇతివృత్తంతోనే తెరకెక్కిన ఈ మూవీలో షారుక్ ఖాన్ కోచ్ పాత్రలో నటించాడు. ఆ మూవీ కూడా మహిళల హాకీ ఇతివృత్తంతోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడా మూవీలో కోచ్ పాత్ర పోషించిన బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ ఈ విజయంపై స్పందించాడు.
కోచ్ సోయెర్డ్ చేసిన ట్వీట్‌పై కింగ్ ఖాన్ రియాక్టయ్యాడు. ‘సారీ ఫ్యామిలీ.. నేను రావడం లేటవుతుంది’ అని కోచ్ రీసెంట్ గా ట్వీట్ చేశాడు. మూవీలో కోచ్ కబీర్‌ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ ”సరే ఏం ప్రాబ్లం లేదు. మీరు వచ్చేటప్పుడు 100 కోట్ల మంది ఉన్న కుటుంబానికి గోల్డ్ తీసుకురండి చాలు. మీ ఎక్స్ కోచ్ కబీర్ ఖాన్” అని రిప్లై ఇచ్చాడు.
తొలి క్వార్టర్ నుంచినే భారత మహిళలు పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించారు. రెండో క్వార్టర్ లో పెనాల్టీ అవకాశాన్ని గోల్ గా మలిచారు. ఆ తర్వాతి రెండు క్వార్టర్లలో ఆస్ట్రేలియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, విజయాన్ని నమోదు చేసి, చరిత్రలో తొలిసారి సెమిస్ ఎంట్రీ ఇచ్చారు.
Haan haan no problem. Just bring some Gold on your way back….for a billion family members. This time Dhanteras is also on 2nd Nov. From: Ex-coach Kabir Khan. https://t.co/QcnqbtLVGX
— Shah Rukh Khan (@iamsrk) August 2, 2021