కెప్టెన్ అంటే జట్టుని ముందుండి నడిపించడమే కాదు.. సహచర ఆటగాళ్లను అర్ధం చేసుకోవడం కూడా అవసరం. ఈ విషయంలో ధోని ఎప్పుడూ ముందే ఉంటాడు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచులో ఒకప్పుడు ధోని ఏం చేసాడో ఇప్పుడు శామ్సన్ అలాగే చేసి అందరి మనసులని గెలుచుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచులో కేకేఆర్ ఫేవరేట్ గా బరిలోకి దిగగా.. రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెంకటేష్ అయ్యర్(57) అర్ధ సెంచరీతో రాణించగా.. మిగిలిన వారెవ్వరూ కూడా సహకారం అందించలేదు. ఇక డీసెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కేవలం 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించి ఈ ఐపీఎల్ లో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(98) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కెప్టెన్ సంజు శాంసన్ (48) అతనికి చక్కని సహకారం అందించాడు. ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్ లో శాంసన్ చేసిన ఒక పని ఆకట్టుకుంటుంది. ఎప్పుడో ధోని చేసిన ఈ పని ఇప్పుడు శాంసన్ చేయడం విశేషం.
వివరాళ్లోకి వెళితే..ఈ మ్యాచ్ లో జైస్వాల్ వన్ మ్యాన్ షో చూపించాడు. 150 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ బౌలర్లను సునాయాసంగా ఆడుతూ.. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే వ్యక్తి గత స్కోర్ 94 పరుగుల వద్ద చేరుకున్నాడు. ఇక రాజస్థాన్ గెలవాలంటే కేవలం 3 పరుగులే చేయాలి. కానీ స్ట్రైకింగ్ లో మాత్రం శాంసన్ ఉన్నాడు. చివరి బంతిని శాంసన్ డిఫెండ్ చేస్తే.. ఆ తర్వాత ఓవర్లలో జైస్వాల్ సిక్స్ కొడితే సెంచరీ కంప్లీట్ అవుతుంది. కానీ కేకేఆర్ బౌలర్ సాయేశ్ వైడ్ బాల్ వేసే ప్రయత్నం చేసాడు. దీన్ని ముందుగానే గ్రహించిన శాంసన్ లెగ్ సైడ్ వైపుకి జరిగి మరీ ఆడాడు. ఆ తర్వాత ఓవర్లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకో అని జైస్వాల్ కి సైగ చేసాడు. ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీ కోసం శాంసన్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు.
సరిగ్గా.. 2016 టీ 20 వరల్డ్ కప్ లో ఇలాంటి సీన్ జరిగింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో కోహ్లీ మ్యాచ్ మొత్తం బాగా ఆడి టీం ఇండియాని విజయ తీరాలకు చేర్చాడు. అయితే అప్పుడే గ్రీజ్ లోకి వచ్చిన ధోని 19 ఓవర్ చివరి బంతికి కేవలం ఒక్క రన్ తీస్తే టీం ఇండియా గెలుస్తుంది. కానీ పార్నెల్ వేసిన ఈ బంతిని ధోని కావాలనే డిఫెండ్ చేసాడు. కోహ్లీ మ్యాచ్ ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ధోని చేసిన ఈ పనికి అప్పట్లో అందరూ ఫిదా అయ్యారు. ఇక తాజాగా జైస్వాల్ సెంచరీ కోసం శాంసన్ సరిగ్గా ఇలాంటి త్యాగంతోనే అందరి మనసులని గెలిచి ధోనిని గుర్తు చేసాడు. మరి జైస్వాల్ కోసం శాంసన్ చేసిన త్యాగం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.