ఇంటర్నేషనల్ డెస్క్- రష్యా ప్రయోగించిన రాకెట్ అదుపుతప్పింది. అది భూమివైపు వేగంగా దూసుకువస్తోంది. అంతరిక్షంలోకి గతవారం రష్టా ఏడుగురు వ్యామోగాములతో ఓ రాకెట్ ను పంపించింది. అంతరిక్షానికి చేరుకున్న కొద్ది గంటల్లోనే ఆ రాకెట్ మండిపోయిందని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా గుర్తించింది. ఐతే ఈ రాకెట్‌లో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, వారంతా సురక్షితంగా ఉన్నారని రష్యా అధికారిక మీడియా పేర్కొంది.
రష్యా రాకెట్ లో ఉన్న వ్యోమగాముల్లో ఇద్దరు రష్యా, ముగ్గురు నాసా, ఒకరు జపాన్, ఐరోపా స్పేస్ ఏజెన్సీకి చెందినవారు ఒకరు ఉన్నారు. రష్యా పంపించిన మల్టీపర్పస్ మాడ్యూల్ గురువారం అంతరిక్ష కేంద్రంలోకి చేరిన తరువాత, సుమారు మూడు గంటల తర్వాత ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. భూమికి 250 మైళ్ల ఎత్తున ఉన్న అంతరిక్ష కేంద్రానికి చేరిన తర్వాత ఇంజిన్ రీస్టార్ చేస్తున్న సమయంలో మల్టీపర్పస్ మాడ్యూల్ అదుపుతప్పిందని రష్యా మీడియా స్పష్టం చేసింది.
అంతరిక్ష నౌక బయలుదేరిన 45 నిమిషాల కన్నా ఎక్కువసేపు నియంత్రణ కోల్పోయిందని, భూ కేంద్రంలో ఉన్న శాస్త్రవేత్తల బృందాలు కక్ష్యలో ఉన్న మరో మాడ్యూల్‌లోని ఇంజిన్‌ను మండించి తిరిగి పునరుద్ధరించగలిగాయని రష్యా తెలిపింది. ఆటోమేటిక్ సెన్సార్ల ద్వారా అంతరిక్ష కేంద్రం సాధారణ స్థితిని గుర్తించి, అందులోని వ్యోమగాములకు ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించినట్టు స్పష్టం చేసింది. ఇక ఈ నౌక భూకక్ష్యలోకి ప్రవేశించే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
మొన్న చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్-బి రాకెట్ అదుపుతప్పగా, భూమిపైకి తీసుకురాగా, హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనతో సీఎస్టీ-100 స్టార్‌లైనర్ క్యాప్యూల్ ప్రయోగాన్ని ఆగస్టు 3 వరకు నాసా వాయిదా వేసింది. ఈ శుక్రవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అట్లాస్-5 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించాల్సి ఉంది.
A recap of today’s @Space_Station news and activities:
🛰️ Teams are conducting checkouts of the newly arrived Russian Nauka module
🚀 The #Starliner spacecraft is ready. Stay tuned for a new launch date for @BoeingSpace‘s Orbital Flight Test-2Details: https://t.co/X4hXhRmPpz pic.twitter.com/5jcRfUnpL8
— NASA (@NASA) July 29, 2021