టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ చేసిన సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీ.. ఈ ఏడాది జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా మేకర్స్ ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు. అయితే.. ప్రస్తుతం భీమ్లా నాయక్ రన్ టైం గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.
భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీ పెద్దగా సాంగ్స్ లేకుండానే 3 గంటల నిడివి కలిగి ఉంటుంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాకి సంబంధించి 2 గంటల 10 నిమిషాలుగా ప్రచారం జరుగుతోంది. మరి పెద్దగా పాటలు లేని ‘అయ్యప్పనుమ్ కోషియం’ నిడివే 3 గంటలుంటే.. భీమ్లా నాయక్ లో 5 పాటలు ఉంటాయని తెలుస్తుంది. మరి 5 పాటలున్న భీమ్లా నాయక్ సినిమాలో నిడివి 47 నిముషాలు తగ్గడం ఏంటని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.
సాధారణంగా స్టార్స్ సినిమాలంటే ఎక్కువ నిడివినే కోరుకుంటారు.. అలాంటిది ఇందులో రానా లాంటి ప్రత్యర్థితో పవన్ విరోధం అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ఇప్పటికే భీమ్లా నాయక్ సాంగ్స్, టీజర్స్ ఓ రేంజిలో హైప్ క్రియేట్ చేశాయి. మరి ఇలాంటి టైంలో సినిమా నిడివి గురించి తెలిసేసరికి పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. పవన్ నటించిన సినిమాల్లో ఏ సినిమాకి కూడా ఇంట తక్కువ(130 నిమిషాలు) డ్యూరేషన్ లేదు.ఈ సినిమా మద్యానికి బానిసైన ఒక రిటైర్డ్ హవాల్దారుకి, అతన్ని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారికి మధ్య కథాంశం సాగుతుంది. ఇక తెలుగులో హవాల్దారుగా రానా, పోలీస్ అధికారిగా పవన్ కనిపించనున్నాడు. ఇందులో పవన్ భార్య నిత్యామీనన్ క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. త్రివిక్రమ్ రచన సహకారం అందించిన ఈ రీమేక్ మూవీకి సంబంధించి 130 నిమిషాల్లో ఒరిజినల్ సినిమా సోల్ ఎలా కాపాడతారు? అనేది ప్రశ్న. అయితే ఉద్యోగం కోల్పోయిన పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్, పలుకుబడి కలిగిన విలన్ పాత్రలో రానా బాగానే అనిపిస్తున్నారు. కానీ వీరిని చూపించేటప్పుడు ఏ ఒక్కరూ తగ్గకుండా ఎలా చూపించాలి.. ఏ ఒక్కరిని తక్కువ చేసినా ఫలితం బెడిసికొట్టే అవకాశం ఉంది. మరి తక్కువ నిడివిలో పాటలు, స్టోరీ, పాత్రలకు న్యాయం ఎలా చేస్తారో చూడాలి.
భీమ్లా నాయక్ నిడివి ఇంకా అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు. కానీ సినిమా పై వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. భీమ్లా నాయక్ థియేట్రికల్ హక్కులు 40 కోట్లకు, ఆడియో హక్కులు 5 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి భీమ్లా నాయక్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.