ఫిల్మ్ డెస్క్- ట్రిపుల్ ఆర్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సమయానుకూలంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబందించిన ఒక్కో అంశాన్ని రివీల్ చేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి.. సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్, ఆలియాభట్, అజయ్ దేవగణ్ లాంటి భారీ తారగణం ఉండటం కూడా హైప్ క్రియోట్ చేస్తోంది.
ఈ సినిమా బడ్జెట్ పరంగానే కాదు, ఆడియో, షాటిలైట్ హక్కుల పరంగాను రికార్డులను బద్దలు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ కు సంబందించి ఇప్పటికే విడుదలైన టీజర్లు, మేకింగ్ వీడియోలతో మంచి డిమాండ్ ఏర్పడింది. దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆర్ఆర్ఆర్‌కు క్రేజీ వచ్చింది. షూటింగ్ కాకముందే మొత్తం బిజినెస్ పూర్తైన ఘనత ఆర్ఆర్ఆర్ సినిమాకే దక్కింది.
ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటికే అన్ని హక్కులు అమ్ముడుపోయాయి. శాటిలైట్ రైట్స్ కు సుమారు 400 కోట్లకు పైగా వచ్చినట్టు సమాచారం. దక్షిణాదిన మొత్తంగా స్టార్ నెట్వర్క్ ఆర్ఆర్ఆర్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఉత్తరాదిన పెన్ స్టూడియోస్ ఆర్ఆర్ఆర్‌ను భారీ రేటుకు కైవసం చేసుకుంది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా మ్యూజికల్ రైట్స్‌కు సంబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. సౌత్ మొత్తానికి గానూ లహరి సంస్థ, ఉత్తరాదిన టీ సిరీస్ సంస్థలు ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా ఆడియో రైట్స్ సుమారు 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో ఇంత భారీ మొత్తంలో ఆడియో రైట్స్ అమ్ముడు పోవడం ఇదేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.