రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడుటాలీవుడ్ నుండి వెళ్లి బాలీవుడ్ ని కంటి చూపుతో శాసించిన స్టార్ డైరెక్టర్. విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు తన కథలతో టోటల్ ఇండియానే ఒక ఊపు ఊపేస్తున్న స్టార్ రైటర్. వీరిద్దరూ కలసి ఒకే వేదికని పంచుకుంటే, అది కూడా ఒకరితో ఒకరు సరదాగా మాటలు కలిపితే, మూవీ లవర్స్ కి ఇది ఆసక్తి కలిగించే అంశమే. తాజాగా సునీల్ హీరోగా నటించిన ‘కనబడుటలేదు’ అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదిక అయ్యింది.
ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన విజయేంద్ర ప్రసాద్ ముందుగా వర్మని ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “1989లో ఎలాంటి అనుభవం లేకుండా వచ్చి, శివ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు ఓ కుర్రాడు. అతను ఇప్పుడు నాకు “కనబడుటలేదు”. శ్రీదేవిలో ఎప్పుడూ చూడని అందాలని.. తెరపై అద్భుతంగా చూపించిన ఆ వ్యక్తి ఇప్పుడు నాకు “కనబడుటలేదు”. “రంగీలా, సత్య, కంపెనీ.. లాంటి సినిమాలతో బాలీవుడ్ ని షేక్ చేసిన ఆ టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు నాకు “కనబడుటలేదు” అంటూ.. వర్మ స్థాయిని గుర్తుచేసే ప్రయత్నం చేశారు విజయేంద్ర ప్రసాద్. దీంతో.., ఆడిటోరియం అంతా హోరెత్తిపోయింది. ఇక తరువాత.. మైక్ అందుకున్న వర్మ.. తనదైన రీతిలో కామెంట్స్ చేశారు.
వేదికను అలకంరించిన పెద్దలకు ఇప్పుడు నేను నమస్కారం పెట్టడం లేదు అంటూ.. వర్మ తన స్పీచ్ ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈవెంట్‌కు గెస్ట్ గా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ గడ్డంపై ఫోకస్ పెట్టారు ఆర్జీవీ. “చాలా రోజులుగా మిమ్ములను ఒక విషయం అడగాలని అనుకుంటున్నా.. మీరు గడ్డం పెంచడానికి ఇన్సిపిరేషన్ నరేంద్ర మోడీనా..? రవీంద్రనాథ్ ఠాగూర్‌నా..? లేదా.. రామాయణం కన్నా అద్భుతమైన బాహుబలి కథ రాశారు కాబట్టి వాల్మీకిలా గడ్డం పెంచారా..? లేదంటే.. బోడి నా కొడుకు రాజమౌళినే అంత గడ్డం ఉంటే, నాకు ఎంత ఉండాలని ఇలా గెడ్డం పెంచారా? నాకు తెలిసి అదే అయ్యుంటుంది.. అంటూ ఆర్జీవీ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇలా.. ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ మాటలతో “కనబడుటలేదు” ప్రీరిలీజ్ ఈవెంట్ అంతా సందడి సందడిగా నడించింది. మరి.., వీరి సరదా సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.