పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారాహి పేరిట బస్సు యాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. పవన్ వారాహి యాత్ర ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి, నిజంగా పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఆగిపోయిందా? అసలు ఏమైంది?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రాజకీయపరంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. పవన్ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటం అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం కచ్చితంగా కనపడుతుందని, పదుల సంఖ్యలో సీట్లు గెలిచే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, పవన్ కల్యాణ్ చేపట్టబోయే ‘వారాహి’ బస్ యాత్ర ద్వారా మరింత ప్రభావం ఉంటుందని అంటున్నారు. పవన్ ‘వారాహి’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే.. పార్టీ జెట్ స్పీడులో ప్రజల్లోకి దూసుకెళుతుందని అంటున్నారు. కానీ, పవన్ ‘వారాహి’ యాత్రపై సందిగ్ధత నెలకొంది. వారాహి యాత్ర ఆగిపోయిందని సోషల్ మీడియా గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. పవన్ తన వారాహిని ఇంకా బయటకు తీసుకురాకపోవటానికి ఓ బలమైన కారణం ఉందట. అదేంటంటే..
2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలోకి రావటానికి ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్న ఈ తరుణంలో.. ప్రభుత్వంపై ఉద్యోగులకు అసంతృప్తి బాగా పెరిగిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని ఉద్యోగులు భావిస్తున్నారట. రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఓ ఎమ్మెల్సీ స్థానం కాగా.. రెండోది కడప-అనంతపురం-కర్నూలు జిల్లాలకు సంబంధించింది. ఈ ఎన్నికల ద్వారా రాయలసీమలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఈ ఎన్నికల్ని అధికార పార్టీ కీలకంగా భావిస్తోందట. ఈ ఎన్నికల్లో పాజిటివ్ ఫలితాలు వస్తే.. అది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తోందట. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోందట.
ఇక, పట్టభద్రుల ఎన్నికల విషయానికి వస్తే.. మొత్తం మూడు పట్ట భద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే.. ఏపీలో ఉద్యోగాల కల్పన విషయంలో.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే విషయంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి, పట్టభద్రుల్లో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఉంటారు. నిరుద్యోగులు ఉంటారు. వీరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేకపోలేది. వీరిని దృష్టిలో పెట్టుకుని కూడా అధికార పార్టీ ముందుకు వెళుతోందట. వీరిని మంచి చేసుకునే పనిలో పడ్డారంట స్థానిక నేతలు.
ఇక, పవన్ తన వారాహి యాత్రను ఇంకా ప్రారంభించకపోవటానికి ప్రధాన కారణం.. ఎమ్మెల్సీ ఎన్నికలేనట. ముఖ్యంగా టీచర్స్, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రభుత్వానికి వచ్చే ఫలితాలను బట్టి ముందడుగు వేసే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారంట. ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూసి వారాహి యాత్రను ప్రారంభించనున్నారట. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలోకి రావటానికి ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు కాబట్టి.. ప్రస్తుతం ప్రభుత్వం పట్ల వారి వైఖరి ఎలా ఉంటుందో టీచర్స్ ఎన్నికల ద్వారా తేలిపోతుందని పవన్ భావిస్తున్నారట. నిరుద్యోగులు కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉందని అనుకుంటున్నారట.
టీచర్స్, పట్టభద్రులు ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటే ఒకలాంటి ప్లాన్‌ను.. వ్యతిరేకంగా ఉంటే మరోలాంటి ప్లాన్‌తో ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే తన యాత్రను ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే.. వచ్చే ఫలితాలను బట్టి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లనున్నారట. అయితే, వారాహి యాత్ర ఆలస్యం అయ్యేకొద్ది అభిమానుల్లో, జనసేన కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ఎంత తొందరగా వారాహి బస్సు యాత్రను ప్రారంభిస్తే అంత మంచిదని అంటున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు కాగా 3 పట్టభద్రులు స్థానాలు, 2 ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే వారాహి బస్ యాత్ర మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరి, వారాహి యాత్రకు బ్రేక్ ఇవ్వటంలో.. పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.