నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటూ సాగుతున్న రచ్చ.. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో హిందీ జాతీయ భాష అనే విషయంలోనూ పెద్ద చర్చ నడుస్తోంది. మరి.. బయట ఇంత హాట్ టాపిక్ నడుస్తుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఖాళీగా ఎందుకు ఉంటారు? తాజాగా.. వర్మ ఈ విషయంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. “దక్షిణాది లేదా ఉత్తరాది.. కాదు భారతదేశం మొత్తం ఒక్కటే అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రాంతీయత, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భాషలనేవి వృద్ధి చెందాయి. భాష.. ప్రజలు చేరువ కావడానికి దోహదపడుతుంది. విడదీయడానికి కాదు” అని వర్మ ముందుగా ట్వీట్ చేశారు. కానీ.., అక్కడితో ఆగిపోతే ఆయన రామ్ గోపాల్ వర్మ ఎందుకు అవుతాడు? తరువాత బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్స్ సంధించారు.
I believe so Ajay ..I know u as a person for so long and I know u could never mean it in the way it seemed to some ..Languages grew out of regional and cultural conviniences and were always meant to integrate and not seperate https://t.co/eRlqG57r0C
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022
Nothing can drive the point better than ur question on ,what if you answer in Kannada to a Hindi tweet from @ajaydevgn .. Kudos to you and I hope everyone realises there’s no north and south and india is 1 https://t.co/g0IOvon8nV
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022
“బాలీవుడ్‌లో కేజీయఫ్ మూవీ రూ.50 కోట్లు ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతకుముందు బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇలా సౌత్ సినిమాలు అన్నీ అక్కడ భారీగా వసూలు చేస్తుండటంతో ఉత్తరాది తారలు దక్షిణాది స్టార్స్ పై అసూయతో ఉన్నారనేది కాదనలేని సత్యం. ఇక బాలీవుడ్ మూవీస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో మనము చూద్దాం. బాలీవుడ్ లో బంగారం ఉందా? కన్నడలో బంగారం ఉందా? అనేది “రన్ వే 34″ మూవీ ఓపెనింగ్స్ వల్ల తేలిపోతుంది” అంటూ ఆర్జీవీ వరుస ట్వీట్స్ తో రెచ్చిపోయాడు.
Whether u intended or not am glad u made this statement ,because unless there’s a strong stir , there cannot be a calm especially at a time when there seems to be a war like situation between Bolly(north)wood and Sandal(South) wood https://t.co/SXPqvrU8OV
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022
కాగా.. “రన్ వే 34” మూవీలో అమితాబ్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటించారు… “రన్ వే 34″ని టార్గెట్ చేస్తూ.. వర్మ సెటైరికల్ గా ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక.. దీనికి ముందే కన్నడ స్టార్ హీరో సుదీప్, హిందీ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మధ్య.. ట్వీట్స్ వార్ నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. వర్మ ట్వీట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The base undeniable ground truth @KicchaSudeep sir ,is that the north stars are insecure and jealous of the south stars because a Kannada dubbing film #KGF2 had a 50 crore opening day and we all are going to see the coming opening days of Hindi films
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022
Like the PROOF of the PUDDING is in the eating , the runway 34 collections will prove how much GOLD (kgf2) is there in HINDI versus KANNADA .. @ajaydevgn versus @KicchaSudeep
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022