అమరావతి- ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం సినిమా థియేటర్స్ కే సినిమా చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్స్ లో ఉన్నత అధికారులు వరుస తనిఖీలు చేస్తూ.. యాజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. జీవో 30 ప్రకారం థియేటర్లలో ఉండాల్సిన వసతులు, టికెట్ల ధరలు, క్యాంటీన్‌లో అమ్మె తినుబండారాలకు సంబంధించి అధిక ధరలు వసూలు చేస్తూ.. నిబంధనలు పాటించని థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి : చంద్రబాబును కాదని.. వైసీపీలో చేరబోతున్న హీరో సుమన్
తనిఖీల్లో భాగంగా కృష్ణా జిల్లాలో 15 థియేటర్ల యజమానులకు నోటీసులివ్వడమే కాక వీటిలో 12 థియేటర్లను మూసివేశారు. అలానే విజయనగరంలో 6 థియేటర్లు మూసి వేయగా.. శ్రీకాకుళంలో మరో ఆరు థియేటర్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. పశ్చిమగోదావరి ఏలూరులోని 2 థియేటర్లలో అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నారనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించి.. ఓ థియేటర్ కు రూ. 2 లక్షల జరిమానా విధించారు.
ఇది కూడా చదవండి: థియేటర్స్ లో నా సినిమాలు ఉచితంగా చూపిస్తా.. పవన్ కళ్యాణ్