ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రాధే శ్యామ్ మూవీకి యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈనెల 23న శనివారం రాధే శ్యామ్ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
రాధే శ్యామ్ టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చాలా సైలెంట్‌గా వచ్చిన టీజర్ మైండ్ బ్లోయింగ్ వ్యూస్ తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. రాధే శ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధిచిన టీజర్ నే మేకర్స్ విడుదల చేయగా, అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇక రాధే శ్యామ్ టీజర్ కేవలం 23 గంటల్లోనే 4 కోట్ల వ్యూస్‌కి పైగా రాబట్టడం ఆసక్తిరేపుతోంది. ఇంతవరకు టాలీవుడ్‌లో ఏ సినమా టీజర్ కు రాని విధంగా భారీ వ్యూస్ ను రాబడుతూ రాధే శ్యామ్ టీజర్ దూసుకుపోతోంది. సైలెంట్‌గా ఉన్న రాధే శ్యామ్ టీజర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుదని ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన రాధే శ్యామ్ టీజర్ రిలీజ్ తరువాత, సినిమాపై ఇన్నాళ్ళు ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రాధే శ్యామ్ 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రభాస్ గత సినిమాల రికార్డులను బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.